Monsoon Health Tips: ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై వరద నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని.. విఫా తుఫాన్ అవశేషం కావడంతో బలపడుతుందని ఐఎండీ అంచనా వేసింది.
వర్షా కాలం కొనసాగుతోంది. ఎడతెరిపి లేని వానల వల్ల పరిసరాలు మొత్తం బురద మయంగా మారుతుంది. చెత్తా చెదారం పేరుకుపోయి దోమల వ్యాప్తికి కారణం అవుతుంది. వర్షాకాలం వ్యాధుల కాలం అన్నట్లు వైరల్ ఫీవర్స్ వెంటాడుతుంటాయి. ఆసుపత్రులకు రోగులు క్యూకడుతుంటారు. దోమలు వచ్చాయి అంటే కచ్చితంగా వాటి వెనుక వ్యాధులు కూడా వస్తాయి. వర్షాకాలంలో ముఖ్యంగా వైరల్ ఫీవర్స్, టైఫాయిడ్, డెంగ్యూ, మలేరియా, జలుబు, దగ్గు వంటి వ్యాధులు సోకుతాయి. ఈ వ్యాధుల భారిన పడ్డప్పుడు సాధారణం…