Masterdating: యువతలో కొత్త “డేటింగ్” ట్రెండ్.. అసలు ‘‘మాస్టర్ డేటింగ్’’ అంటే ఏమిటి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Masterdating: ‘డేటింగ్’ నేటి యువతకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అమ్మాయిలు, అబ్బాయిలు తమ రిలేషన్‌షిప్‌లో ఒకరినొకరు అర్థం చేసుకునేందుకు డేటింగ్ చేసుకోవడం చాలా కామన్. అయితే, ప్రస్తుతం యువత కొత్త డేటింగ్ ట్రెండ్‌కి తెరతీసింది. ‘‘ మాస్టర్ డేటింగ్’’ అనే కొత్త డేటింగ్‌లో మునిగితేలుతున్నారు. సోషల్ మీడియాలో ఈ పదం ట్రెండింగ్‌లో ఉంది. మాస్టర్ డేటింగ్ హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. అంశంపై 1.6 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. మాస్టర్ డేటింగ్‌లో తమ అనుభవాలను పంచుకుంటున్నారు. అయితే, ఇది డేటింగ్‌తో పోలిస్తే చాలా భిన్నం. Gen Z యువత ఈ కొత్త డేటింగ్ ‘‘మాస్టర్ డేటింగ్’’ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.
మాస్టర్ డేటింగ్ అంటే ఏమిటి..?
Also Read
- Rainy Season Tips : వర్షాకాలంలో చర్మ దురదకు చెక్.. త్రిఫలతో సహజ చిట్కాలు!
- Ferty9: అంతర్జాతీయ పరిశోధనల్లో విశేష గుర్తింపు.. ప్రపంచ వేదికపై తెలుగు రాష్ట్రాలకు గర్వకారణంగా 'ఫెర్టీ9'!
- Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!
- Easy Wall Cleaning Tips: గోడలపై మరకలా? ఖరీదైన క్లీనర్లు వద్దు.. ఇంట్లో ఉన్నవే చాలు.!
మాస్టర్ డేటింగ్‌లో ఒక వ్యక్తి తనను తాను ప్రేమగా, కేరింగ్‌గా చూసుకోవడమే. వ్యక్తులు తమకు తాము ఖరీదైన రెస్టారెంట్లకి వెళ్లడం, మార్స్, బార్స్, పార్కులు, మ్యూజియంలు ఇలా మొదలైన వాటికి వెళ్తుంటారు. స్పాలో తమను తాము ఎంజాయ్ చేస్తుంటారు. తమకు తాము ఖరీదైన గిఫ్ట్స్ ఇచ్చుకుంటారు.
నిజానికి ఇది ఒక వ్యక్తి తనను తాను ప్రేమించుకోవడం, శ్రద్ధగా చూసుకునే ఒక పద్ధతి కావచ్చు. అయితే, ఇది మీకు జీవితంతో ఎవరూ లేరని, మీరు ఒంటరిగా ఉన్నరనే అర్థం కాదు, సెల్ఫ్-లవ్, సెల్ఫ్-కేర్ గా చూసుకోవడం. మిమ్మల్ని మీరు ముందుగా ప్రేమించకపోతే, వేరే వారిని ఎలా ప్రేమిస్తారనే భావన ‘‘మాస్టర్ డేటింగ్’’లో కీలకమైంది.
ఈ డేటింగ్ ద్వారా మీకు మీరు సమయాన్ని కేటాయించుకుంటారు, మీ ఇష్టాలు, అవసరాలను తెలుసుకుంటారు, మీ భావాలను విశ్లేషించుకుని, మిమ్మల్ని మీరు బాగా అర్థం చేసుకుంటారు. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని మరింగా పెంచుతుంది. ప్రపంచాన్ని ఒంటరిగా ఎదుర్కొనే ధైర్యాన్ని మీలో పెంచుతుంది.
మాస్టర్ డేటింగ్ అవసరం ఏంటీ..?
నిజానికి మనకు ఏం కావాలి, మన అవసరాలు ఏంటీ అని తెలుసుకున్నప్పటికీ, పాటించడం చాలా అరుదు. మనం అందరి చేత ప్రేమించబడాలని అనుకుంటాము, దీనికి ముందు వేరే వారి నుంచి ప్రేమ ఆశించే ముందు మనల్ని మనం ప్రేమించడం, బాధ్యతగా చూసుకోవడం చాలా ముఖ్యం.
ఎవరైనా రెస్టారెంట్‌లో ఒంటరిగా భోజనం చేయడం, థియేటర్‌కి వెళ్లి సినిమా చూడటం వంటివి చేస్తే, మనకు ఎవరూ తోడుగా లేరనే ఆలోచన, విచారం మనలో వ్యక్తం అవుతుంది, అయితే మనం ఎందుకు ఇలా ఆలోచించాలి..? ప్రజలు, ముఖ్యంగా మహిళలు ఒంటరిగా సినిమా చూడటం, రెస్టారెంట్‌లో భోజనం చేయడం ఎందుకు సాధారణం కాదనే ప్రశ్న ఉద్భవిస్తుంటుంది. వీటన్నింటికి సమాధానమే ఈ ‘‘మాస్టర్ డేటింగ్’’. దీని ద్వారా మనల్ని మనం సంతోషంగా ఉంచుకోవడం దీని ప్రధాన ఉద్దేశం.
తాజావార్తలు
-
Dhanush: ‘రాయన్’ అవార్డుపై ధనుష్ స్పందన.. ‘మెయ్యళగన్’ మంచి సినిమానే, కానీ నా బాధ వేరే!
-
Arshdeep Singh: మై పర్సన్.. ప్రేమను అధికారికంగా ప్రకటించిన అర్ష్‌దీప్ సింగ్.. సమ్రీన్ కౌర్ ఎవరు?
-
Vaibhav Sooryavanshi: నా కల నిజమైంది.. ఇక మరింత రెచ్చిపోతా.. వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Rishikanta Singh Chanambam: రోజుకు రూ.200 కూలీ నుంచి కామన్వెల్త్ గేమ్స్ రజత పతకం వరకు.. రిషికాంత సింగ్ ప్రయాణం ఇలా.!
-
Bhagyashri Borse: ఆ సూపర్ స్టార్‌తో డిన్నర్ డేట్ చేయాలని ఉంది.. మనసులో మాట చెప్పిన ‘లెనిన్’ హీరోయిన్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Record: జింబాబ్వేపై తుఫాన్ హాఫ్ సెంచరీ.. వైభవ్ సూర్యవంశీ మరో వరల్డ్ రికార్డు!
-
iPhone 18 Pro, Pro Max ఫుల్ డీటెయిల్స్ లీక్.. లాంచ్ అప్పుడే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో చర్మ దురదకు చెక్.. త్రిఫలతో సహజ చిట్కాలు!
-
CSK-Hardik Pandya: ఇద్దరు టాప్ స్టార్ ప్లేయర్స్, రూ.10 కోట్లు.. హార్దిక్ పాండ్య కోసం సీఎస్కే భారీ ఆఫర్!
-
Ishan Kishan: వైభవ్ సూర్యవంశీకి అన్ని తెలుసు.. ఆ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త అని హెచ్చరించాం!