వివాహ బంధంలో గొడవలు కామన్.. అయితే కొన్ని విషయాల్లో మహిళలు చాలా సీరియస్ గా తీసుకుంటారు..ఆడవాళ్లు ఏదోక విషయానికి బాగా ఆలోచిస్తారు.. వాటి కారణంగా భర్తలని తిడుతుంటారు. మగవారు ఏ పని చేసినా ఆడవారికి సాధారణంగా నచ్చదు. దీంతో భర్తకి కచ్చితంగా చిరాకు వస్తుంది. మరోవైపు, పార్టనర్ అనుకోకుండా ఏదైనా మరిచిపోతే, ఆడవాళ్లు నోటికి పనిచెబుతారు.. ఎందుకు చేశావ్ అంటూ నోటికి వచ్చినట్లు అంటారు.. ఆ విషయంలో అస్సలు వెనకడుగు వెయ్యరు.. ఒకరమైన ప్రవర్తనను కలిగి ఉంటారు..
ఇక మగవారు తమ ఫ్రెండ్స్‌తో ఎన్నో జోక్స్ వేసుకుంటారు. ఒకరి జోక్స్ చూసి ఒకరు నవ్వుకుంటారు.. ఇలాంటివి ఆడవారికి అస్సలు నచ్చవు.. తన గురించే ఎదో అనుకున్నారు అంటూ సీరియస్ అవుతారు.. తన భర్తకి ఆడవారు ఫ్రెండ్స్ ఉంటే ఏ భార్య ఒప్పుకోదు. వారి గురించి పొగిడినా ఇంకేం చేసినా అది ఓ రకమైన అభద్రతా భావంతో భర్తపై అనుమానం పెరుగుతుంది.. దీనివల్ల మగవారికి కొన్ని సార్లు విపరీతమైన కోపం వస్తుంది.. ఆ సమయంలో వాళ్ళు చాలా వింతగా ఆలోచిస్తారు.. వింత వింతగా ప్రవర్తిస్తారు.. అందుకే ప్రతి విషయంలో ఆడవారితో ఉండాలని పెద్దలు చెబుతున్నారు..
ఈరోజుల్లో సోషల్ మీడియాను వాడని వాళ్ళు అస్సలు ఉండరు.. సోషల్ మీడియా వాడకంలో మహిళలు చాలా ముందున్నారు. చాలా మంది మహిళలు తమ భర్తలతో ఉన్న ఫొటోలను సోషల్ సైట్లలో షేర్ చేస్తుంటారు. ప్రైవసీని ఇష్టపడేవారికి ఇవన్నీ నచ్చకపోవచ్చు. భార్యలు తమ భర్తలు అందరి ముందు ప్రేమ చూపాలని కోరుకుంటారు. ఇది జరగకపోతే కొంతమంది మహిళలు పెద్ద సమస్యగా భావిస్తారు.. అందుకే గొడవలు కూడా వస్తాయి.. ఇక తమకు నచ్చని విషయాలను మాట్లాడితే అస్సలు ఊరుకోరు.. ఉదాహరణకు నువ్వు లావు ఉన్నావని, నలుగురిలో ఉన్నప్పుడు నువ్వు ఇలా చేసావని అంటే అదే తలచుకొని కుళ్లి కుళ్లి ఏడుస్తారు.. అందుకే మగవాళ్ళు ఇలాంటి విషయాలను దృష్టిలో ఉంచుకొని ఉంటే మరీ మంచిది..