పెళ్లి ఒక చదరంగం.. సంసారం ఒక సముద్రం అని ఆ నాడు ఓ వ్యక్తి అన్నాడు అది నిజమ.. సంసారం ముందుకు సాగాలంటే ఎన్నో భరించాలి.. దంపతుల మధ్య గొడవలు రావడం సహజం.. మనస్పర్థలు కూడా వస్తూనే ఉంటాయి.. చిరాకులు, చికాకులు వస్తాయి.. అవి లేకుంటే బంధం చప్పగా ఉంటుంది.. అయితే ఏదైనా కూడా త్వరగా పరిష్కరించాలి.. లేకుంటే మాత్రం అవి పెద్ద గొడవకు దారితీస్తాయి.. తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పు తప్పే కాబట్టి.. క్షమాపణ అడగాల్సిందే.
అయితే లైఫ్ పార్ట్‌నర్‌ను క్షమాపణ అడిగేటప్పుడు ఏదో అలా సారీ అని చెప్పేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. అసలు క్షమాపణ ఎలా అడగాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. మృదువు గా మాట్లాడటానికి ప్రయత్నించాలి. గంభీరంగా, కటువు గా క్షమాపణ చెబితే అది స్వీకరించే వారి మనసును కరిగించలేదు. అందుకే స్వరాన్ని తగ్గించి సారీ చెప్పాలి.. భాగస్వామి చెప్పేది శ్రద్ధగా వినాలి. వారు ఏదైనా చెబుతున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు పరధ్యానంగా ఉంటే ఎదుటివారు హర్ట్ అవుతారు. కాబట్టి వారు చెప్పేది శ్రద్ధగా వినాలి, వింటున్నట్లు వారికి అనిపించేలా చేయాలి..
సారీ చెప్పడానికి ముందు గొంతు సవరించి సుత్తి లేకుండా, ల్యాగ్ లేకుండా చెప్పాలనుకున్నది చెప్పాలి.. చెబుతున్నప్పుడు అక్కడి వరకే పరిమితం కావాలి. మళ్లీ అదే అంశంపై మరోసారి చర్చకు దారి తీయకూడదు. ఇది అసలు లక్ష్యాన్ని దెబ్బతీస్తుంది. సారీ చెప్పాలనుకున్నప్పుడు సారీ చెప్పేసి అలా చేయడం తప్పని, ఆ తప్పును తర్యాత రియలైజ్ అయ్యానని చెప్పి సారీ అడగాలి… గతాన్ని మరోసారి తవ్వుకోకూడదు.. ఏదైనా సరదాగా తీసుకోవడం మంచిది.. ఇలా చిన్న చిన్నవి సర్దుకుంటే సంసారం ఒక అమృతం అవుతుంది.. మనసు తో ఏదైనా ఆలోచించాలి.. ఒకరిపై మరొకరి కి ప్రేమ ఉండాలి .. అన్నిటికన్నా ముఖ్యంగా నమ్మకం ఉండాలి.. అప్పుడే బంధం మరింత బలంగా ఉంటుంది. ఇది గుర్తుంచుకోండి.. చిన్న నవ్వు చాలు గొడవలు మాయం..