ఒకప్పుడు అబ్బాయిలను తలెత్తి చూడాలన్నా కూడా అమ్మాయిలకు తెగ సిగ్గు.. ఇప్పుడు అబ్బాయిలనే కొట్టేస్తున్నారు.. అబ్బాయిలు ప్రేమలో పడితే ఎలా ఉంటారో చూస్తూనే ఉన్నాం.. మరి అమ్మాయిలు ప్రేమలో పడితే ఎలా ఉంటారో అనేది చాలామందికి తెలుసుకోవాలని ఉంటుంది.. ఈరోజుల్లో నిజమైన ప్రేమ అనేది లేదు.. కొంతమంది కోరికలు తీర్చుకోవడానికి ప్రేమిస్తే.. మరికొంతమంది టైమ్ పాస్ కోసం ప్రేమిస్తారు.. ఇంకో కొంతమంది నిజంగానే ప్రేమించిన అబ్బాయి కోసం ప్రాణం ఇస్తారు.. అమ్మాయిలో ప్రేమలో పడితే ఎటువంటి తప్పులు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం…
సాధారణంగా ఆడవాళ్లకు ఎగ్జైట్‌మెంట్ ఎక్కువ. ఇక లవ్ విషయంలోనూ అంతే ఎగ్జైటింగ్‌గా ఫీల్ అవుతూ లవ్ యాక్సెప్ట్ చేస్తారు., ఎవైనా మెమరీస్, బాయ్ ఫ్రెండ్ గురించి ప్రతి ఒక్క విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటారు.. వారే ప్రపంచంగా బ్రతుకుతారు..వారి గురించి కాకుండా ఎదుటి వారితోనే టైమ్ గడపాలని అస్సలు అనుకోరు.. తమ బాయ్ ఫ్రెండ్ తోనే మాట్లాడుతూ ఉండాలని అనుకుంటారు.. రిలేషన్ షిప్‌లో ఉన్నప్పుడు కొంతమంది ఇంపార్టెన్స్‌కి ఇచ్చే ఇంపాక్ట్ మారిపోతుంటుంది. కొంతమంది తమ బాయ్‌ఫ్రెండ్‌కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చి ఫ్రెండ్స్‌ని కూడా పక్కన పెడతారు.. ఇలా పొరపాటున కూడా చెయ్యొద్దని నిపుణులు చెబుతున్నారు.. బంధాలను దూరం చేసుకుంటే మళ్లీ దగ్గరకు రావని హెచ్చరిస్తున్నారు..
అబ్బాయి ప్రేమను ప్రేమ యాక్సెప్ట్ చెయ్యగానే చాలా మంది అప్పటికే భార్యగా ఫీలైపోయి.. వారికి కావాల్సిన పనులన్నీ చేసేస్తుంటారు.. అప్పటివరకూ ఉన్న తమ ఇష్టాలను కూడా పట్టించుకోకుండా తమ లవర్ ఇష్టాలనే ఓన్ చేసుకుంటారు. దీంతో తమ ఐడెంటిటీని కూడా కూడా మిస్ అవుతుంటారు..ఇష్టాలనే కాదండోయ్ తమ లక్ష్యాలను కూడా పట్టించుకోరు. తమ పార్టనర్ లక్ష్యాన్ని సాధించేందుకే ఆరాట పడతారు. అందుకోసం కృషి చేసి వారు చేసేదంతా చేస్తారు.. వారి జీవితాన్నే పూర్తిగా మర్చిపోతారు.. ప్రేమ జీవితంలో ఒక భాగం మాత్రమే.. దీంతో పాటు అన్నీ ఉంటేనే జీవితం హాయిగా ఉంటుంది..ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి..