పిల్లల ఆహారం విషయంలో ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి లేకుంటే మాత్రం అనేక రకాళ జబ్బుల బారిన పడే అవకాశం ఉందని చెబుతున్నారు.. ఇకపోతే పోషకాలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని ఇవ్వాలి.. అప్పుడే సీజనల్ వ్యాధి నుంచి బయట పడతారు.. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్యం నిపుణులు చెబుతున్నారు.. వారికి ఎటువంటి ఆహారాన్ని ఇవ్వడం మేలో ఇప్పుడు తెలుసుకుందాం..
చిన్నపిల్లల ఆహరం విషయంలో ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి.. ఎదిగే వయస్సు కాబట్టి పోషకాలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని ఇస్తూ ఉండాలి అప్పుడే వారి ఎదుగుదల సక్రమంగా ఉంటుంది.. వారిని ఎల్లప్పుడూ గమనిస్తుండాలి. వారు చేతికి దొరికినదల్లా నోట్లో పెట్టుకుంటుంటారు.. అందువల్ల వారిపై ఓ కన్నేసి ఉంచాలి. అయితే కొన్ని రకాల ఆహారాలను మాత్రం చిన్నారులకు ఇచ్చే విషయంలో జాగ్రత్త వహించాలి. లేదంటే అవి వారి గొంతులో ఇరుక్కుపోయి ఇబ్బందులను కలిగించేందుకు అవకాశాలు ఉంటాయి. ఈ పిల్లలకు పండ్లను ఇస్తే జ్యూస్ రూపంలో చేసి తాగించాలి. లేదా చాలా చిన్న ముక్కలుగా కట్ చేసి ఇవ్వాలి. అంతేకానీ పెద్ద ముక్కలుగా చేసి ఇవ్వరాదు. అలా ఇస్తే అవి గొంతులో ఇరుక్కుని పోయేందుకు అవకాశం ఉంటుంది..
ఇక పిల్లలకు చాక్లేట్స్,టాఫీలు, బిస్కెట్ల వంటివి కూడా ఎక్కువగా ఇవ్వరాదు. ఎందుకంటే అవి కూడా గొంతులో ఇరుక్కుపోయేందుకు అవకాశాలు ఉంటాయి. పాప్ కార్న్ కూడా ఇవ్వరాదు. అవి పెద్దగా ఉంటాయి.. వాళ్లకు తెలియదు.. దాంతో వాళ్లకు ఊపిరి కూడా ఆడదు.. కనుక సులభంగా ఇరుక్కుపోతాయి. ఇక బటన్స్, పెన్ క్యాప్‌లు, స్టేషనరీ వస్తువులు, కాయిన్లను కూడా పిల్లలకు దూరంగా ఉంచాలి. లేదంటే ఇబ్బందుల్లో పడిపోతారు.. ఇక ఎక్కువ గట్టిగా, చిన్నగా ఉండే కాయకూరలను కూడా అస్సలు ఇవ్వకండి.. గొంతులో ఇరుక్కుంటుంది.. పళ్ళు ఉన్న పిల్లలకు ఏదైనా ఒకటి.. మరీ చిన్నపిల్లలను జాగ్రత్తగా ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది..ఇలాంటి విషయాలలో పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలి..