అమ్మతనం అనేది ప్రతి అమ్మాయి జీవితంలో అనుభూతి చెందదలిచే మధురమైన క్షణం. అయితే, నేటి సొసైటీలో ఎక్కువ మంది మహిళలు వివాహం ఆలస్యంగా చేసుకోవడం వలన, ఈ అనుభూతికి ఆలస్యం అవుతున్నారని పరిశీలకులు చెబుతున్నారు. పెళ్లి సాధారణంగా యవ్వనంలో, బాల్యం తర్వాత, వ్యక్తి వైవాహిక జీవితానికి అడుగు పెట్టినప్పుడు జరుగుతుంది. పెళ్లి తర్వాత పిల్లలు పుట్టడం కూడా ప్రకృతి ధర్మం. సాధారణంగా, మహిళల్లో 13 సంవత్సరాల వయసులో సంతానోత్పత్తి ప్రారంభమయ్యే శక్తి ఏర్పడుతుంది. అబ్బాయిలలో అయితే, 14–15 సంవత్సరాల తర్వాత వారికీ ఈ శక్తి ఏర్పడుతుంది.అయితే, ఆధునిక వైద్య పరిశీలనలు సూచిస్తున్నాయి, సురక్షితమైన మరియు ఆరోగ్యకరమైన గర్భధారణ సాధారణంగా 20–30 ఏళ్ల మధ్య జరగడం ఉత్తమం. ఈ వయసులో, సంతానం కుదిరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తల్లి, శిశువు ఆరోగ్య సమస్యలు తక్కువగా ఎదురవుతాయి. కానీ ప్రజంట్ పరిస్థితులు మాత్రం మొత్తం మారిపోయాయి..
త్వరగా పెళ్లి చేసుకున్న.. పిల్లల్ని మాత్రం త్వరగా కనడం లేదు. కెరీర్.. డబ్బు బాధ్యత అంటూ ఆలస్యం చేస్తున్నారు. కానీ తర్వాత పిల్లలు కావాలి అనుకున్న వారికి సంతానం అందడం లేదు. సమస్య వయసు. కానీ తాజాగా బాలీవుడ్ స్టార్ కత్రినా కైఫ్ 42 ఏళ్ల వయసులో తల్లి అవుతున్న వార్త ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంపై నిపుణులు, గైనకాలజిస్టులు సరైన దృష్టికోణాన్ని పంచుతున్నారు. 40 ఏళ్ల తర్వాత గర్భధారణ కు సంబంధించి సవాళ్లు ఉండవచ్చు, కానీ సరైన జాగ్రత్తలు తీసుకుంటే ప్రెగ్నెన్సీ సురక్షితంగా ఉండగలదని డాక్టర్ గైనకాలజీ నిపుణురాలు చెప్పారు. అలాగే
ఆలస్యపు గర్భధారణ ఇప్పుడు మామూలు
కత్రినా కైఫ్, సల్మా హాయక్, హాలీ బెర్రీ వంటి సెలబ్రిటీల ఉదాహరణలు చూస్తే, మాతృత్వానికి వయసు కేవలం అడ్డంకి కాదని తెలుస్తోంది. కెరీర్ లక్ష్యాలు, ఆర్థిక స్థిరత్వం, వ్యక్తిగత కారణాల వల్ల చాలా మహిళలు ఇప్పుడు 40లలో పిల్లలను కనడానికి మొగ్గు చూపుతున్నారు. కానీ ఇరవై లేదా 30ల ప్రారంభంలో గర్భం దాల్చే వయసుతో పోలిస్తే, 40ల్లో కొన్ని ఆరోగ్య సమస్యల ముప్పు ఎక్కువగా ఉంటుంది. అయితే ప్రణాళికతో కూడిన గర్భధారణ, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు, ఆరోగ్యకరమైన జీవనశైలి పాటిస్తే తల్లి, బిడ్డ ఆరోగ్యం కాపాడగలుగుతారు. వయసు పెరుగుతున్న కొద్దీ సహజ సంతానోత్పత్తి తగ్గుతుంది. ముఖ్యంగా 35 ఏళ్ల తర్వాత అండాల సంఖ్య, నాణ్యత తగ్గి, గర్భం దాల్చడం కష్టతరం అవుతుంది. ఈ సందర్భాల్లో IVF (అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ) అవసరమవుతుంది.
తల్లికి కలిగే ప్రమాదాలు:
1. జెస్టేషనల్ డయాబెటిస్
2. హైపర్‌టెన్షన్ (అధిక రక్తపోటు)
3. ప్రీఎక్లాంప్సియా
4. ప్రసవ సమయంలో సమస్యలు ఏర్పడడం, సిజేరియన్ అవసరం
5. క్రమం తప్పకుండా ప్రినేటల్ కేర్, వ్యాధులను ముందస్తుగా గుర్తించడం ద్వారా ఈ ప్రమాదాలు తగ్గించవచ్చని డాక్టర్ లు పేర్కొన్నారు.
శిశువుకు కలిగే ప్రమాదాలు:
1. డౌన్ సిండ్రోమ్ వంటి క్రోమోజోమ్ అసాధారణతలు
2. నెలలు పూర్తికాలా పుట్టకపోవడం, తక్కువ బరువుతో పుట్టడం
3. అధునాతన స్క్రీనింగ్ పరీక్షలు, ప్రినేటల్ డయాగ్నస్టిక్స్ ద్వారా ఈ సమస్యలను ముందే గుర్తించి సమర్థవంతంగా నిర్వహించవచ్చని నిపుణురాలు పేర్కొన్నారు.
సురక్షితమైన ప్రెగ్నెన్సీ కోసం సూచనలు
ప్రణాళికతో గర్భధారణ: గర్భం కోసం ప్రయత్నించడానికి ముందే వైద్యుడిని సంప్రదించి పూర్తి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి.
క్రమం తప్పని ప్రినేటల్ చెకప్స్: సమస్యలను ముందే గుర్తించడానికి తరచుగా వైద్య పరీక్షలు చేయించాలి.
ఆరోగ్యకరమైన జీవనశైలి: సమతుల్య ఆహారం, తగినంత వ్యాయామం, సరైన బరువు, ధూమపానం మరియు మద్యపానానికి దూరంగా ఉండటం.
మానసిక ఆరోగ్యం: ఒత్తిడిని నియంత్రించడం, కుటుంబ మద్దతు పొందడం.
గమనిక: ఈ కథనం సమాచారం మాత్రమే. వ్యక్తిగత సమస్యలకు సంబంధించి వైద్యుడిని సంప్రదించడం అవసరం.