Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Lifestyle Here Is Dark Chocolate Health Benefits And Nutrition Deets Inside

Dark Chocolate Benefits: డార్క్ చాక్లెట్‌‌తో ఎన్ని లాభాలో తెలుసా? ఈ వ్యాధులన్ని మాయం..!

Published Date :December 23, 2023 , 6:17 pm
By snehalatha
Dark Chocolate Benefits: డార్క్ చాక్లెట్‌‌తో ఎన్ని లాభాలో తెలుసా? ఈ వ్యాధులన్ని మాయం..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Dark Chocolate Benefits: కోకో కంటెంట్ ఎక్కువగా ఉండే డార్క్ చాక్లెట్స్‌లో ఎన్నో పోషకాలు ఉన్నాయని తెలుసా? రోజూ డార్క్ చాక్లేట్ ఓ మోతాదులో తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య లాభాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. ఇందులో ఫైబర్‌, ఖనిజాలతో పాటు అదనంగా పొటాషియం, ఫాస్పరస్, జింక్, సెలీనియం పుష్కలంగా ఉంటాయి. ఇది అనేక వ్యాధుల నుండి ఉపశమనం కలిగించే కొన్ని పోషకాలను కలిగి ఉంటుంది. చాక్లెట్‌లో ఉండే కెఫిన్ ఒత్తిడిని తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటుంది. డిప్రెషన్‌ను నియంత్రించడానికి డార్క్ చాక్లెట్ చాలా మంచిదని చాలా మందికి తెలుసు. అలాగే దీన్ని తీనడం వల్ల మరెన్నో లాభాలు ఉన్నాయట. అవేంటో చూద్దాం!

డార్క్ చాక్లెట్ కోకో గింజల నుండి తయారువుతుందనే విషయం చాలా మంది తెలుసు. అయితే దీనిని చాలా మంది ఓ సాధారణ చాక్లెట్‌గానే చూస్తారు. మరికొందరు చేదు ఉంటుందని అవైయిడ్ చేస్తారు. కానీ డార్క్ చాక్లెట్‌లో అనేక రకాల శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. వాస్తవానికి, ఇతర ఆహారాల కంటే ఎక్కువగా ఉంటాయి. డార్క్ చాక్లెట్‌లోని ఫ్లేవనాయిడ్స్ నైట్రిక్ ఆక్సైడ్‌ని ఉత్పత్తి చేయడానికి ధమనుల లైనింగ్ అయిన ఎండోథెలియంను ప్రేరేపిస్తాయి. నైట్రిక్ యాక్సైడ్ ధమనులకి రెస్ట్ తీసుకునేందుకు సిగ్నల్స్ ఇవ్వడం, రక్త ప్రవాహానికి నిరోధకతను తగ్గిస్తుంది. అందువల్ల రక్తపోటుని తగ్గిస్తుంది.

Dark Chocolate 1

Dark Chocolate 1

అనేక అధ్యయనాలు కోకో, డార్క్ చాక్లెట్ రక్తప్రవాహాన్ని మెరుగుపరుస్తాయని చెబుతున్నాయి. దానివల్ల గుండె జబ్బులు దరిచేరవు. అలాగే ఈ చాక్లెట్ ఎలివేటెడ్ కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. దానివల్ల రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. డార్క్ చాక్లెట్స్‌లో పాలీఫెనాల్స్, ఫ్లేవనోల్స్, కాటెచిన్స్ ఉన్నాయి. పరిశోధన ప్రకారం, డార్క్ చాక్లెట్స్‌లోని పాలీ ఫెనాల్స్ బాదం, కోకో వంటి ఆహారాలతో కలిపినప్పుడు కొన్ని రకాల చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించడంలో సాయపడతాయి.

కోకో, డార్క్ చాక్లెట్స్‌లలో బ్లూ బెర్రీస్, అకాయ్ బెర్రీస్ వంటి పండ్ల కంటే ఎక్కువ యాంటీ ఆక్సిడెంటీ యాక్టివిటీ, పాలీఫెనాల్స్, ఫ్లేవనోల్స్ ఉన్నాయని అధ్యయనం చెబుతోంది. అదే విధంగా డార్క్ చాక్లెట్‌లో తక్కువ మొత్తంలో ఐరన్ ఉంటుంది. ఇది రక్తహీనతను కూడా నివారిస్తుంది. ఎర్ర రక్త కణాల ఏర్పాటుకు ఐరన్ చాలా ముఖ్యమనే విషయం తెలిసిందే. ఈ డార్క్ చాక్లెట్ తీసుకోవడం వల్ల తగినంత ఐరన్ లభిస్తుంది. దీంతో రక్తహీనతను తగ్గించుకోవచ్చు. అంతేకాదు ఇది రోగనిరోధక వ్యవస్థను కూడా బలపరుస్తుందట. డార్క్ చాక్లెట్‌లో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి కణాలను రక్షించడంలో సహాయపడతాయి.

Chocolate 2

Chocolate 2

సమతుల్య ఆహారంలో భాగంగా డార్క్ చాక్లెట్ తీసుకోవడం రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చాక్లెట్ సెల్ డ్యామేజ్‌తో పోరాడుతుంది. డార్క్ చాక్లెట్‌లో ఉండే ఫ్లేవనాయిడ్స్ క్యాన్సర్‌ను నివారించడంలో కూడా సహాయపడతాయి. ఇది క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తుంది. మధుమేహంపై కూడా చాక్లెట్ పనిచేస్తుంది. డార్క్ చాక్లెట్‌లో పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇవి ఇన్సులిన్ నిరోధకతను మెరుగు పరుస్తాయి. అలాగే, బరువు తగ్గడానికి కూడా చాక్లెట్ సహాయపడుతుందట. డార్క్ చాక్లెట్ మితమైన మోతాదులో తీసుకుంటే బరువు తగ్గుతారట. ఇందులో మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు జీవక్రియను మెరుగుపరచడంతో కేలరీలను వేగంగా బర్న్ చేస్తాయట.

అలాగే డార్క్ చాక్లెట్స్ రోజూ తినడం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు నిపుణులు. సాధారణంగా మార్కెట్లో డార్క్ చాక్లెట్స్ చిన్న చతురస్త్రాకారంలో దొరుకుతాయి. అవి తినొచ్చు. మార్కెట్లో ప్రతి డార్క్ చాక్లెట్ ఆరోగ్యానికి మంచిది కాదని గుర్తుంచుకోండి. అందులోని పదార్థాలను గమనించి తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. 70 శాతం అంతకంటే ఎక్కువ కోకో కంటెంట్‌తో ఉండేవి తీసుకోవాలంటున్నారు. డార్క్ చాక్లెట్స్‌లో కూడా వివిధ రకాలు ఉంటాయి. ఎక్కువ ముదురు రంగులో ఉన్న చాక్లెట్స్‌లో తక్కువ చక్కెర ఉంటుంది. అవి మాత్రమే తినాలని నిపుణులు సూచిస్తు్న్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Benefits of Dark Chocolate
  • Dark Chocolate
  • Dark Chocolate Health Benefits
  • life style

తాజావార్తలు

  • RCB Vs CSK: చిన్నస్వామిలో RCB సిక్సర్ల సునామీ.. టిమ్ డేవిడ్ వీరవిహారం.. స్కోర్ ఎంతంటే..

  • LG QNED Evo TV: 4K క్వాలిటీ, 330Hz గేమింగ్, AI ఫీచర్లతో.. ఎల్జీ 115 అంగుళాల స్మార్ట్ టీవీల ఆవిష్కరణ

  • CM Revanth Reddy : యువత బాట.. ఆటపాట.. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా ‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’

  • Hyundai Car Discounts: భారీ డిస్కౌంట్లు ప్రకటించిన హ్యూందాయ్.. ఏకంగా రూ.1.10 లక్షలు..

  • Rayalaseema Special Chutney : అమ్మమ్మల కాలం నాటి సీక్రెట్ హెల్తీ రెసిపీ.. పది నిమిషాల్లో రాయలసీమ స్టైల్‌లో రెడీ చేసుకోండి!

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions