Health Tips : తులసి మొక్క ఎండిపోయినా.. మీ ఇంటికి ఇంకా ఉపయోగమే..!
- ఎండిన తులసితో సహజ దోమల నివారిణి తయారీ
- మొక్కలకు శక్తినిచ్చే సహజ ఎరువుగా తులసి
- ఆరోగ్యానికి మేలు చేసే తులసి మసాలా చాయ్
- హోమాలు, పూజల్లో ఎండిన తులసి ప్రత్యేకత
- ఇంటి పవిత్రత పెంచే తులసి తీర్థం రహస్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Health Tips : భారతీయ సంస్కృతిలో తులసి కేవలం ఒక మొక్క మాత్రమే కాదు, అది ఒక పవిత్రమైన దైవిక చిహ్నం. ఈ మొక్కను సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావించి పూజిస్తారు. కేవలం దైవారాధనలోనే కాకుండా, ఆయుర్వేదంలో కూడా తులసికి ఒక విశిష్టమైన స్థానం ఉంది. ఇది ఒక అద్భుతమైన ఔషధ గని. అయితే చాలామంది ఇళ్లలో తులసి మొక్క ఎండిపోగానే దానిని పనికిరానిదిగా భావించి పారేస్తుంటారు. కానీ, ఆయుర్వేదం , ఉద్యానవన నిపుణుల ప్రకారం, తులసి మొక్క ఎండిపోయిన తర్వాత కూడా దాని ఆకులు, కొమ్మలు, వేర్లు అంతే ప్రభావవంతంగా, పవిత్రంగా పనిచేస్తాయి. ఎండిన తులసిని ఇంట్లోనే ఏవిధంగా అద్భుతంగా ఉపయోగించుకోవచ్చో ఇప్పుడు చూద్దాం.
రసాయనాలు లేని సహజ దోమల నివారిణి
ప్రస్తుతం మార్కెట్లో దొరికే దోమల నివారణ మందులు (కాయిల్స్, లిక్విడ్స్) రసాయనాలతో కూడి ఉండి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. వీటికి బదులుగా ఎండిన తులసి ఆకులను సహజ దోమల నివారిణిగా వాడుకోవచ్చు. ఎండిన తులసి ఆకులను చిన్న ముక్కలుగా చేసి, అందులో కొంచెం కర్పూరం వేసి కాల్చడం వల్ల వచ్చే సువాసన గల పొగ ఇల్లంతా వ్యాపిస్తుంది. తులసిలో ఉండే సహజ కీటకనాశక గుణాల వల్ల ఇంట్లోని ప్రతి మూల నుండి దోమలు, ఈగలు , ఇతర చిన్న చిన్న కీటకాలు తక్షణమే పారిపోతాయి. ఇది పూర్తిగా సురక్షితమైన, రసాయన రహిత పద్ధతి.
Also Read
- Raw Mango Roti Pachadi: అమ్మ చేతి రుచిని గుర్తు చేసే పుల్లటి "మామిడికాయ రోటి పచ్చడి" చేసేయండి ఇలా.!
- Summer Health : ఎండకాలంలో లీచీ పండు తింటే ఏమవుతుందో తెలుసా..? అమృతం అనుకుంటే ప్రమాదమే.!
- Headache: మైగ్రేన్ తో బాధపడుతున్నారా..? ఈ ఒక్క ఆకు చాలు.. నిమిషాల్లో రిలీఫ్
- Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ 'చికెన్ పచ్చడి'.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
మట్టి నాణ్యతను పెంచే అద్భుత ఎరువు
ఒకవేళ మీ ఇంట్లోని తులసి మొక్క ఎండిపోయినా , కుళ్ళిపోయినా దానిని బయట పారేయకండి. ఆ మొక్క కాండం, వేర్లు , ఆకులను చిన్న ముక్కలుగా కత్తిరించి లేదా పొడిగా తయారుచేసుకోండి. ఈ మిశ్రమాన్ని మీ తోటలోని మట్టిలో, ఇతర మొక్కల కుండీలలో కాస్త లోతుగా పాతిపెట్టండి. ఇది మట్టి నాణ్యతను పెంచడమే కాకుండా, ఇతర మొక్కలకు ఎలాంటి ఫంగస్ (శిలీంధ్రాలు) , వేరు కుళ్ళు తెగుళ్లు సోకకుండా సహజ రక్షణ కవచంలా పనిచేస్తుంది.
నోరూరించే హెల్తీ ‘మసాలా చాయ్’
ఎండిన తులసి కొమ్మలు, ఆకులను నూరిన తర్వాత మిగిలే ముతక భాగంతో అద్భుతమైన చాయ్ మసాలా తయారు చేసుకోవచ్చు. ఈ తులసి పొడికి రెండు మూడు టీస్పూన్ల ఎండిన గులాబీ రేకులు, లవంగాలు, యాలకులు, సోంపు గింజలు , ఒక చిన్న దాల్చినచెక్క ముక్కను జోడించి రోకలిలో బాగా దంచుకోవాలి. ఈ సుగంధ ద్రవ్యాల మిశ్రమంతో తయారుచేసే మసాలా టీ అద్భుతమైన రుచిని ఇవ్వడమే కాకుండా, రోగనిరోధక శక్తిని పెంచి జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధుల నుండి ఉపశమనం కలిగిస్తుంది.
హోమం, పూజల్లో పవిత్ర ధూపం
ఇంట్లో చిన్నపాటి హవనం (హోమం) చేసినప్పుడు, ప్రతిరోజూ సాయంత్రం పూజ తర్వాత ఇచ్చే హారతి సమయంలో ఎండిన తులసి కట్టెలను ఉపయోగించవచ్చు. గుగ్గులు, కర్పూరం , ధూపంతో పాటు ఈ ఎండిన తులసి ముక్కలను కూడా ఆ మంటలో వేయాలి. దీనివల్ల వెలువడే పవిత్రమైన పొగ ఇల్లాంటి ప్రతికూల శక్తిని (Negative Energy) తొలగించి, మానసిక ప్రశాంతతను చేకూరుస్తుంది. అంతేకాదు, ఈ పొగ గాలిని శుద్ధి చేసే సహజ క్రిమిసంహారిణిగా కూడా పనిచేస్తుంది.
ఇంటి పవిత్రతను పెంచే ‘తులసి తీర్థం’
ఎండిన తులసి కొమ్మలు చాలా సన్నగా ఉంటే, వాటిని శుభ్రం చేసి నీటితో నింపిన ఒక రాగి పాత్రలో వేసి ఉంచాలి. కొన్ని గంటల పాటు ఆ కొమ్మలను నీటిలోనే ఉంచడం వల్ల తులసిలోని ఔషధ గుణాలు నీటిలోకి చేరుతాయి. ఆ తర్వాత ఆ నీటిని ఇల్లంతా చల్లాలి. శాస్త్రీయంగా చూస్తే, తులసి సారం కలిగిన ఈ నీరు గాలిలోని బ్యాక్టీరియాను , సూక్ష్మక్రిములను నశింపజేస్తుంది. ఆధ్యాత్మికంగా ఇది ఇంటి పవిత్రతను, సానుకూల శక్తిని రెట్టింపు చేస్తుంది. అందుకే ఎండిన తులసిని ఎప్పుడూ చెత్తబుట్టలో వేయకుండా, ఇలాంటి ఉపయోగకరమైన పద్ధతుల్లో వాడటం ఎంతో శ్రేయస్కరం.
తాజావార్తలు
-
Health Tips : తులసి మొక్క ఎండిపోయినా.. మీ ఇంటికి ఇంకా ఉపయోగమే..!
-
Byjus Story: కోట్ల సామ్రాజ్యం నుంచి కోర్టు మెట్ల వరకు.. బైజూస్ రవీంద్రన్ పతనం వెనుక అసలు కథ ఇదే!
-
Thailand visa : ఈ ఒక్క ట్రిక్ తెలిస్తే థాయ్‌లాండ్‌లో 5 ఏళ్ళు ఉండొచ్చని తెలుసా ? ఏం చేయాలంటే ?
-
Byju Raveendran: కటకటాల్లోకి బైజూస్ బాస్.. సింగపూర్ కోర్టు సంచలన తీర్పు, అసలు ఏం జరిగిందంటే?
-
Thriller Movie : చీకటి పడితే భయంతో తలుపులు మూసేసుకునే గ్రామం… ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..
-
200MP కెమెరా, 8600mAh బ్యాటరీ, Dimensity 8550 Elite చిప్‌తో HONOR 600 సిరీస్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10100mAh బ్యాటరీతో HONOR Pad 20 లాంచ్.!
-
Raw Mango Roti Pachadi: అమ్మ చేతి రుచిని గుర్తు చేసే పుల్లటి “మామిడికాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!