ప్రస్తుతం చాలా మంది మంది ఫ్యాటీ లివర్ కారణంగా ఇబ్బందిపడుతున్నారని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. చాలామంది లివర్ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. లివర్ మన శరీరంలో ముఖ్యమైన భాగం. ఇది మన శరీరంలో 500పైగా పనులు నిర్వహిస్తుంది. కాలేయం మన శరీరం నుంచి విషాన్ని, హానికరమైన పదార్థాలను తొలగిస్తుంది. మన శరీరంలోని జీర్ణకోశ నాళం నుంచి వచ్చే రక్తాన్ని లివర్ ఫిల్టర్ చేస్తుంది. ఆహారం జీర్ణం చేయడానికి లివర్ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఆహారం జీర్ణం అయిన తర్వాత హార్మోన్, ఎంజైమ్, ప్రోటీన్, కొలస్ట్రాల్‌ను తిరిగి శరీరానికి అందిస్తుంది. ఇలాంటి ముఖ్యమైన అవయవాన్ని రక్షించుకోవడం చాలా ముఖ్యం. ఈ టిప్స్ పాటించడం ద్వారా లివర్‌ని సంరక్షించుకోండి..
READ MORE: Belly fat: రోజూ నిద్రించే ముందు మీ బెడ్‌పైనే ఈ రెండు వ్యాయామాలు చేయండి.. బెల్లీ ఫ్యాట్ తగ్గడం ఖాయం?
గిలోయ్ ఆకుల జ్యూస్ అనేది ఫ్యాటీ లివర్ సమస్యను తగ్గించేందుకు అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఎక్కువ. ఇది లివర్ ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. లివర్ సంబంధిత వ్యాధుల్నించి రక్షించేందుకు గిలోయ్ ఆకుల జ్యూస్ కీలకంగా పనిచేస్తుంది. రోజూ సగం స్పూన్ గిలోయ్ పౌడర్ వేడి నీటిలో కలిపి తాగాలి. ఇలా రోజూ చేస్తే మంచి ఫలితాలుంటాయి.
READ MORE:Quality Test : పారాసెటమాల్ వంటి మందులు క్వాలిటీ టెస్టులో ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి ?
ఫ్యాటీ లివర్ సమస్యను తగ్గించేందుకు ప్రతి ఇంట్లో తప్పకుండా ఉండే వెల్లుల్లి చాలా బాగా పనిచేస్తుంది. ఇందులో ఉండే ఎలిసిన్, సెలేనియం కారణంగా లివర్ శుభ్రంగా ఉంటుంది. ఎంజైమ్స్‌ను యాక్టివేట్ చేస్తుంది. దీనికోసం ప్రతి రోజూ ఉదయం పరగడుపున 1-2 వెల్లుల్లి రెమ్మల్ని తింటే మంచి ఫలితాలు కన్పిస్తాయి. లివర్ పేరుకున్న కొవ్వును తొలగించేందుకు పసుపును తగిన మోతాదులో సేవించాలి. ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు లివర్ సమస్యను అద్భుతంగా తగ్గిస్తాయి. రోజూ గోరు వెచ్చని నీటిలో కొద్గిగా పసుపు కలిపి తాగాలి.