కాలాలు మారే కొద్ది కొత్త కొత్త రోగాలు రావడం సహజం. ముఖ్యంగా చలికాలం అయితే ఎన్నో రకాల రోగాలు పలకరిస్తాయి. జలుబు, దగ్గు వంటి వ్యాధులు కూడా తరచూ వస్తుంటాయి.. వీటి నుంచి బయట పడాలంటే మంచి పోషకాలు ఉన్న ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి.. చలికాలంలో జలుబు, ఫ్లూతో బాధపడుతున్నట్లయితే మీ రోగనిరోధక శక్తి బలహీనంగా ఉందని అర్థం.. రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్న వారు మాత్రమే తరచుగా వ్యాధుల బారిన పడుతుంటారు. అందుకే ఈ కాలంలో ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. కాగా.. ఈ చలికాలంలో రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి మన ఇంట్లోనే తయారు చేసుకునే ఆయుర్వేద ఔషధం తయారీ గురించి తెలుసుకుందాం..
READ MORE: Madhavaram Krishna Rao: ఎమ్మెల్యే శంకర్‌పై చర్యలు తీసుకోండి.. ఎమ్మెల్యే మాధవరం సీరియస్..
కావాల్సిన పదార్థాలు..
ఒక చెంచా దాల్చిన చెక్క పొడి
అర కిలో బెల్లం
ఒక చెంచా తేనె
ఒక చెంచా నెయ్యి
500 గ్రాముల ఉసిరికాయ గుజ్జు
ఒక చెంచా జాజికాయ చూర్ణం
ఒక చెంచా శొంఠి పొడి
ఒక చెంచా యాలకుల పొడి
READ MORE:TVK president Vijay: ప్రస్తుత పరిస్థితులను చూసి అంబేద్కర్ తలదించుకునే వారు..
మంచి నాణ్యమైన ఉసిరి కాయలు తీసుకోండి. వాటిని నీటితో శుభ్రంగా కడగండి. నీటిలో ఉసిరి కాయలను ఉడికించండి. ఆ తర్వాత గింజలు తీసి ఉసిరి గుజ్జును బయటకు తీయండి. ఇప్పుడు స్టౌ వెలిగించి ఓ గిన్నెలో నెయ్యి వేసి వేడి చేయండి. ఇందులోనే ఉసిరి గుజ్జును వేసి సన్నటి మంటపై వేయించండి. తర్వాత బెల్లాన్ని సన్నగా తురుముకొని ఉసిరి గుజ్జులో వేసి కలపి వేయించండి. ఈ సమయంలోనే ఓ చిన్న గిన్నెలో జాజికాయ చూర్ణం, దాల్చిన చెక్క, యాలకులు, శొంఠి పొడి వేసి కలపండి. బెల్లం కరిగిన తర్వాత ముందుగా కలిపిన పొడులను ఇందులో వేసి కలిపి స్టౌ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకోండి. దీనిలో తేనె కలిపితే రోగనిరోధక శక్తిని పెంచే ఔషధం రెడీ అవుతుంది. దీన్ని ఉదయం, సాయంత్రం ఒక్కో స్ఫూన్ చొప్పున అర కప్పు పాలలో కలిపి తీసుకోవాలి. పాలు గొరు వెచ్చగా ఉండాలి. ఇలా కొన్ని నెలల పాటు చేస్తే.. ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందని నిపుణులు తెలిపారు.