కాలాలు మారే కొద్ది కొత్త కొత్త రోగాలు రావడం సహజం. ముఖ్యంగా చలికాలం అయితే ఎన్నో రకాల రోగాలు పలకరిస్తాయి. జలుబు, దగ్గు వంటి వ్యాధులు కూడా తరచూ వస్తుంటాయి.. వీటి నుంచి బయట పడాలంటే మంచి పోషకాలు ఉన్న ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి.. చలికాలంలో జలుబు, ఫ్లూతో బాధపడుతున్నట్లయితే మీ రోగనిరోధక శక్తి బలహీనంగా ఉందని అర్థం..
వర్షాకాలం, చలికాలంలో ఎక్కువగా ముక్కు దిబ్బడ సమస్య ఏర్పడుతుంది. మారిన వాతావరణం, చల్లటి గాలి వలన ముక్కు దిబ్బడ పడుతుంది. దీంతో శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. ముక్కు దిబ్బెడ.. ఇది ఎంత బాధిస్తుందో అనుభవించిన వారికి తెలుసు. పుప్పొడి, దుమ్ము పురుగులు, పెంపుడు జంతువుల చర్మం లేదా కొన్ని ఆహారాల పదార్థాలు కూడా ముక్కు దిబ్బడకు కారణమవుతాయి.