Madhavaram Krishna Rao: షాద్‌నగర్ ఎమ్మెల్యే వెలమలపై ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నారు. దీనిపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్పందించారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పై సీరియస్ అయ్యారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శంకర్ మొదటి నుంచి అహంకారి పూరిత ధోరణితో మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. కులాల మధ్య ఎమ్మెల్యే ఈ రకమైన మాటలు మాట్లాడినా కాంగ్రెస్ పార్టీ స్పందించలేదని మండిపడ్డారు. శంకర్ పై చర్యలు తీసుకోవాలని పీసీసీ అధ్యక్షుడికి, సీఎం రేవంత్ రెడ్డికి డిమాండ్ చేస్తున్నా అన్నారు. ఏదైనా జరిగితే రేపు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. మరోవైపు కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్ లో ఎమ్మెల్యే శంకర్‌పై వెలమ సంఘం పిర్యాదు చేసింది. దీంతో వెలమలను వీర్లపల్లి శంకర్ దూషించారన్న వివాదం పోలీస్టేషన్ కు చేరింది.
Read also: TGSRTC: ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ శుభవార్త.. హైదరాబాద్‌లో ఆర్టీసీ పికప్ వ్యాన్ సేవలు..
నేను మాట్లాడిన మాటలు వెనక ముందు కత్తిరించారు- ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
మరోవైపు వెలమలను దూషించారన్న వివాదంపై రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ స్పందించారు. తన మాటలు వెలమ జాతికి సంబంధించినవిగా భావిస్తే తన మాటలను ఉపసంహరించుకుంటున్నానని ఎమ్మెల్యే శంకర్ స్పష్టం చేశారు. షాద్ నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ. తను మాట్లాడిన మాటలను వెనక ముందు కత్తిరించి కొన్ని మాటలను మాత్రమే వివాదాస్పదంగా మార్చి కొంతమంది సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారని స్పష్టం చేశారు. గత పదేళ్లుగా నియంతృత్వ ధోరణి అవలంబించిన కల్వకుంట్ల కుటుంబం గురించి ఉద్దేశించి తను మాట్లాడాను తప్ప.. వెలమ సమాజంపై తనకు ఎలాంటి తప్పుడు అభిప్రాయం లేదని క్లారిటీ ఇచ్చారు. ఒకవేళ ఈ మాటలు తప్పుగా భావిస్తే తాను ఈ మాటలను వెనక్కి తీసుకుంటున్నానని అన్నారు.
Pushpa 2: బాక్సాఫీసును రూల్ చేస్తున్న పుష్ప రాజ్.. రప రప రూ.400కోట్లు