వర్షాకాలంలో, చలికాలంలో బయట ఎక్కువగా పాములు తిరుగుతుంటాయి. దీంతో చాలా మంది పాములను చూడగానే భయపడుతుంటారు. పాము కాటుతో ఎంతో ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారు. కానీ చుట్టు పక్కన ఉన్న చిన్న చిన్న మొక్కలు పాము విషం బాడీలో పూర్తిగా చేరకుండా కొంత వరకు తగ్గిస్తాయని చాలా మందికి తెలిసి ఉండదు.. కానీ ఇది వాస్తవం..
పూర్తి వివరాల్లోకి వెళితే.. పాములు ఎప్పుడు, ఎక్కడ కాటేస్తాయో అంచనా వేయడం కష్టం. వర్షాకాలం, చలికాలంలో వాటి సంచారం ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ పాము కాటు వేస్తే వెంటనే చికిత్స తీసుకోవాలి.. లేకపోతే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. అయితే, డాక్టర్ దగ్గరకు వెళ్లేలోపు విషం శరీరమంతా వ్యాపించకుండా చూసుకోవాలి. దీనికి ఆయుర్వేదంలో కొన్ని పరిష్కారాలు ఉన్నాయి. ఆయుర్వేదం ప్రకారం.. బోడ కాకరకాయ ఉపయోగించి కేవలం ఐదు నిమిషాల్లో పాము విషం ప్రభావాన్ని తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
బోడ కాకరకాయను కాంక్రోల్, కంటోల, కత్రాల్ వంటి పేర్లతో కూడా పిలుస్తారు. ఈ మొక్క వేరు నుంచి తయారు చేసిన పొడి విషం ప్రభావాన్ని తగ్గిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ మొక్కపై నిర్వహించిన అధ్యయనాల్లో కూడా, దీని వేరు నుండి తయారైన మూలికా ఔషధాలను చాలా కాలంగా యాంటీ-వీనమ్ గా ఉపయోగిస్తున్నారని తేలింది. ఈ మొక్క కేవలం పాము విషంపైనే కాదు, అన్ని రకాల విషాలపై కూడా పనిచేస్తుందని చెబుతారు. బోడ కాకరకాయలో ఇతర కూరగాయల కంటే 50 శాతం ఎక్కువ ప్రొటీన్లు ఉంటాయి. ఇది చాలా పోషకమైన, రుచికరమైన కూరగాయ.
ఒకవేళ ఎవరైనా పాము కాటుకు గురైతే, తక్షణ ఉపశమనం కోసం బోడ కాకరకాయను రెండు రోజులు ఎండలో ఆరబెట్టి, పొడి చేసుకోవాలి. పాము కాటుకు గురైన వ్యక్తికి ఒక చెంచా పొడిని పాలలో కలిపి తాగించాలి. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ నివేదిక ప్రకారం.. పాము కాటు వేసిన వెంటనే బోడ కాకరకాయ చెట్టు యొక్క రూట్ పేస్ట్‌ను కాటు వేసిన చోట పూయడం వల్ల కూడా విషం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. బోడ కాకరకాయ తాజా ఆకులను రుబ్బి, ఆ రసాన్ని తాగడం వల్ల కూడా విష ప్రభావం తగ్గుతుందని వెల్లడించారు.
నోట్: ఈ బోడ కాకర కాయ కేవలం డాక్టర్ దగ్గరకు వెళ్లేలోపు విషం శరీరం అంతటా వ్యాపించకుండా సహాయపడతాయి… పూర్తిగా నయం చేయదు.. దీని మీదే ఆదారపడి.. ఆస్పత్రికి వెళ్లకుండా ఉండకూడదు.. పాము కరిచిన వెంటనే.. ఆస్పత్రికి వెళ్లి వైద్యునితో చికిత్స చేయించుకోవాలి..