మహిళల్లో క్యాన్సర్ రాకుండా ముందస్తు చర్యలు తీసుకునేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. మహిళలను వేధిస్తున్న క్యాన్సర్లను ఎదుర్కొనేందుకు ఐదారు నెలల్లో టీకా అందుబాటులోకి వస్తుందని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి ప్రతాప్రరావు జాదవ్ అన్నారు. తొమ్మిది నుంచి 16 సంవత్సరాల మధ్య వయస్సు గల బాలికలకు అందిస్తామన్నారు.
రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ క్యాన్సర్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసినట్లు ప్రకటించింది. వచ్చే సంవత్సరం నుంచి ఈ మందులు రష్యన్ పౌరులకు ఉచితంగా అందించనున్నారు. ఈ వ్యాక్సిన్‌ను కేన్సర్ రోగులకు వేయబోమని, క్యాన్సర్ బారిన పడకుండా ముందస్తుగా వేస్తామని తెలిపారు. రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన రేడియాలజీ మెడికల్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ జనరల్ ఆండ్రీ కప్రిన్ ఈ విషయాన్ని వెల్లడించారు.
Cancer Vaccine: క్యాన్సర్ వ్యాధి ఇప్పటికీ వైద్యశాస్త్రానికి అంతు చిక్కనిదిగా ఉంది. క్యాన్సర్ వచ్చిన రోగులు తొలి దశల్లో గుర్తిస్తే తప్పా.. అడ్వాన్సుడ్ స్టేజెస్‌లో దానిని పూర్తిగా నివారించలేదని పరిస్థితి ఉంది. అయితే, ప్రస్తుతం క్యాన్సర్ వ్యాక్సిన్‌పై కొనసాగుతున్న పరిశోధనలు భవిష్యత్తుపై ఆశల్ని పెంచుతున్నాయి.