రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ క్యాన్సర్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసినట్లు ప్రకటించింది. వచ్చే సంవత్సరం నుంచి ఈ మందులు రష్యన్ పౌరులకు ఉచితంగా అందించనున్నారు. ఈ వ్యాక్సిన్‌ను కేన్సర్ రోగులకు వేయబోమని, క్యాన్సర్ బారిన పడకుండా ముందస్తుగా వేస్తామని తెలిపారు. రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన రేడియాలజీ మెడికల్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ జనరల్ ఆండ్రీ కప్రిన్ ఈ విషయాన్ని వెల్లడించారు.