Children Health: ఇంట్లో చిన్న పిల్లలకు జ్వరం వస్తే తల్లిదండ్రులు కాళ్లు చేతులు ఆడవు. చిన్నపాటి జ్వరం వచ్చినా, హడావుడి చేస్తూ భయపడతూ పరుగులు పెడతారు. వాటి సంరక్షణ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. తమ పిల్లలకు జ్వరం వచ్చినప్పుడు తల్లిదండ్రులు చేసే కొన్ని సాధారణ తప్పులు చేస్తుంటారు. కానీ వారు చేసేది తప్పు అని వారు గ్రహించరు. ఇలా చేస్తే తమ పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని భావిస్తారు కానీ అలాంటి తప్పులు మాత్రం అస్సలు చేయకండి అంటున్నారు వైద్యులు. జ్వరం ఉన్న పిల్లలను వేడిగా ఉన్న గదిలో ఉంచకూడదు. ఇంట్లో గది ఉష్ణోగ్రత చల్లగా ఉండేలా చూసుకోవాలి. అలాంటి గదుల్లో జ్వరం వచ్చిన పిల్లలను ఉంచితే జ్వరం అదుపులోకి వస్తుంది. ఇలాంటి సమయంలో ఆహారం తీసుకోలేక వేడి పాలు తాగిస్తుంటారు. కానీ నిజానికి వేడి లేదా చల్లని ఆహారాలు లేదా పానీయాలు ఇవ్వడం వల్ల వారి శరీర ఉష్ణోగ్రతపై ఎటువంటి ప్రభావం ఉండదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
శరీరం కొంచెం వేడిగా అనిపించినా జ్వరం తగ్గకపోయినా స్నానం చేయకూడదు. ఒళ్ళు రుద్దుకుంటే శరీరం అలిసిపోతుంది కాబట్టి స్నానం చేయకుండానే పడుకుంటారు. కానీ అది అస్సలు కరెక్ట్ కాదు. గోరు వెచ్చని నీటిలో లేదా స్పాంజ్ బాత్ (కన్నీళ్లను తడి గుడ్డతో తుడుచుకోవడం)తో ఉష్ణోగ్రత అదుపులోకి వస్తుంది. అంతే కాదు శుభ్రంగా ఉంటే త్వరగా కోలుకుంటారు. జ్వరం వచ్చినప్పుడు ప్రతి పేరెంట్ వారి స్వంత పారాసెటమాల్ వేస్తుంటారు. అది సరైన మార్గం కాదు. పిల్లల నిపుణుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే మందులు వాడాలి. పిల్లలకు స్వీయ మందులు ఎప్పుడూ చేయకూడదు. చాలామంది తల్లిదండ్రులు చేసే పొరపాటు యాంటీబయాటిక్స్ వాడడం. కొన్నిసార్లు మీ పిల్లల శరీరానికి యాంటీబయాటిక్స్ అవసరం ఉండకపోవచ్చు. అయితే వాడితే అది ఇతర దుష్ప్రభావాలను చూపుతుంది. మెడికల్ ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీబయాటిక్స్ ఎప్పుడూ ఉపయోగించకూడదు. పిల్లల శరీరం వాటిని తట్టుకోలేకపోవచ్చు.
దుస్తులను కవర్ చేయకూడదు. ఇలా అస్సలు చేయకూడదని నిపుణులు అంటున్నారు. పొరల పొరలను ధరించడం వల్ల వారి శరీరంలోని వేడి బయటకు రాకుండా చేస్తుంది. దీంతో జ్వరం తగ్గదు. అందుకే వదులుగా ఉండే దుస్తులు ధరించాలి. పిల్లలకు జ్వరం వచ్చినప్పడు మీరు భయపడకండి. భయపడితే ఆలోచనా శక్తి మందగిస్తుంది. ఏ నిర్ణయమైనా టెన్షన్‌లో తీసుకోకండి. టెన్షన్‌లో తప్పుడు నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉంది. కొంతమంది తల్లిదండ్రులు టెంపరేచర్ చూడకుండా మెడిషన్ ఉపయోగిస్తారు. అది తప్పుడు ఆలోచన. ముందుగా జ్వరం ఎంత ఉందో పరిశీలించి తగిన మందులు వాడాలి. జ్వరం తక్కువగా ఉందని తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలకు పంపుతుంటారు. అయితే అది మంచి ఆలోచన కాదు. ఇతర పిల్లలకు ఇన్ఫెక్షన్ వ్యాపించే ప్రమాదం ఉంది. అలాగే మీ పిల్లల ఆరోగ్యం కూడా క్షీణించే అవకాశం ఉంది. కాబట్టి పిల్లలకు జ్వరం వచ్చినప్పుడు టెన్షన్ పడకుండా తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా తగు జాగ్రత్తలు తీసుకోండి. అది మీకు మంచిది.. పిల్లలకు ఆరోగ్యానికి ఇంకా మంచిది.
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.