మనిషి శరీరం చేయగలిగే అత్యుత్తమ వ్యాయామాల్లో యోగా ప్రథమ స్థానాన్ని సంపాదించుకోవడమే కాకుండా, ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆదరణకు నోచుకుంటుంది. ఏ వ్యాయామంతో కూడా పోల్చి చూసినప్పటికీ కూడా యోగాలో ఉన్న చాలా విశిష్టతలు యోగాని చాలా ప్రత్యేకంగా నిలబెడతాయి. యోగకు 5 వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఇది కేవలం శరీరం పై మాత్రమే ప్రభావం చూపించదు. శరీరంతో పాటు మెదడు మరియు ఆత్మ ఇలా అన్నింటిని వృద్ధి చేయడంలో యోగ కీలక పాత్ర…