Health tip:బ్రేక్‌ఫాస్ట్ అధికంగా తీసుకుంటేనే బరువు తగ్గుతారట..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అందంగా ఉండాలంటే స్లిమ్ గా, నాజూగ్గా ఉండాలని, అయితే దానికి సరిపడేంత బరువు కూడా ఉండాలి. నాజూకుతనం మోజులో పడి ఉండాల్సినంత బరువు ఉండకపోతే చాలా సమస్యలు వస్తాయి. కొందరైతే ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవడం మానేస్తే అధిక బరువు తగ్గించుకోవచ్చని భావిస్తుంటారు. అయితే అందులో ఎంతమాత్రం నిజం లేదని పరిశోధకులు చెబుతున్నారు. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవడం మానేస్తే అధిక బరువు పెరుగుతారు తప్ప, బరువు తగ్గరని వారంటున్నారు. ఈ క్రమంలో పలువురు పరిశోధకులు ఈ విషయంపై తాజాగా పరిశోధనలు చేసి ఆ వివరాలను వెల్లడించారు కూడా..!
జర్మనీకి చెందిన లుబెక్ యూనివర్సిటీ పరిశోధకులు 23 సంవత్సరాల వయస్సు ఉన్న 16 మందిని రెండు గ్రూపులుగా విభజించి వారికి 3 రోజుల పాటు భిన్న రకాల ఆహారం ఇచ్చారు. ఒక గ్రూపు వారికి అధికంగా క్యాలరీలు ఉన్న ఆహారాన్ని ఉదయం బ్రేక్‌ఫాస్ట్ రూపంలో ఇస్తే.. అదే ఆహారాన్ని రెండో గ్రూపు వారికి రాత్రి డిన్నర్ రూపంలో ఇచ్చారు.
Also Read
- Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
- Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో 'క్రిస్పీ బైట్స్'.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
- Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే "వెజ్ ఆమ్లెట్".. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
- Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
తరువాత వారం గ్యాప్ ఇచ్చి మళ్లీ అదే విధంగా ఆహారం ఇచ్చారు. ఈ క్రమంలో వారిని పరీక్షించిన పరిశోధకులు తేల్చిందేమిటంటే.. ఉదయం అధిక క్యాలరీలు ఉన్న ఆహారాన్ని బ్రేక్‌ఫాస్ట్ రూపంలో తీసుకున్న వారి మెటబాలిజం పెరిగిందని, వారిలో క్యాలరీలు త్వరగా ఖర్చవుతున్నాయని, అదే రెండో గ్రూపు వారిలో మెటబాలిజం తగ్గిందని గుర్తించారు.
అందువల్ల సదరు పరిశోధకులు చెబుతున్నది ఏమిటంటే.. ఎవరైనా సరే అధిక క్యాలరీలు ఉన్న ఆహారాన్ని ఉదయమే బ్రేక్‌ఫాస్ట్ రూపంలో తీసుకోవాలని, దాంతో బరువు తగ్గుతారని, అదే రాత్రి పూట ఆ ఆహారాన్ని తీసుకుంటే బరువు పెరుగుతారని అంటున్నారు.
అలాగే ఉదయం పూట బ్రేక్‌ఫాస్ట్ మానేయడం కూడా మంచిదికాదని, దాంతో రోజు మొత్తంలో అవసరం అయిన ఆహారం కన్నా ఎక్కువ ఆహారం తీసుకుంటారని, దీని వల్ల అధిక బరువు పెరుగుతారని పరిశోధకులు చెబుతున్నారు. కనుక.. బరువు తగ్గాలంటే.. ఉదయమే ఎక్కువ ఆహారం తీసుకోండి. రాత్రి పూట వీలైనంత తక్కువగా తినండి. దీంతో బరువు తగ్గడమే కాదు, టైప్ 2 డయాబెటిస్ రాకుండా చూసుకోవచ్చు..!
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!