ఈ రోజుల్లో ఏ వస్తువు తిన్నాలన్నా భయమేస్తుంది. ప్రతి ఒక్క వస్తు కల్తీ కావడమే ఇందుకు నిదర్శనం.. అయితే ఇప్పుడు పాప్ కార్న్ రసాయనాలతో కల్తీ అయిపోతుంది. దీంతో పిల్లలకు ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Read Also: Twist: వేరో వ్యక్తితో హోటల్ లో ఉన్న భార్య.. మరో వ్యక్తిపై భర్త దాడి
పూర్తి వివరాల్లోకి వెళితే.. సాధారణంగా మనం థియేటర్లకు వెళితే.. అక్కడ దొరికే ఫుడ్ తప్ప.. వేరే ఫుడ్ అలో చేయరు. ఇంక చేసేదేమీ లేక థియేటర్ లో అమ్మే పాప్ కార్న్, ఫప్స్, చిప్స్ వంటి వాటినే తింటుంటాం.. పైగా ఎక్కువ రేట్లతో కొనుక్కుని తింటుంటాం. అయితే పిల్లలు మాత్రం ఎక్కువగా పాప్ కార్న్ నే ఇష్టపడుతుంటారు. దీంతో ఎక్కువగా పాప్ కార్న్ తినేస్తుంటారు. అయితే.. పాప్‌కార్న్‌లో బటర్, చాక్లెట్, సాల్టీ టేస్టులు రావడానికి ఉపయోగించే ఆర్టిఫీషియల్ ఫ్లేవర్స్‌లో ఉండే కెమికల్స్‌తో మీ పిల్లలకు అతి భయంకరమైన పాప్‌కార్న్ లంగ్స్ అనే వ్యాధి వచ్చే అవకాశం ఉందని నిపుణులు వెల్లడించారు.
Read Also:Horror:దారుణం.. భార్యను సుత్తెతో కొట్టి హత్య.. ఆపై భర్త కూడా…
మాల్స్‌లో, సినిమాహాల్స్‌లో మీ పిల్లలకు పాప్‌కార్న్ కొనిపెడుతున్నారా? అయితే రోగాలు చేతులారా కొని తెచ్చుకున్నట్లే! పాప్‌కార్న్ లంగ్స్ అనే వ్యాధి పేరు ఎప్పుడైనా విన్నారా? పాప్‌కార్న్ ఊపిరితిత్తులు,” లేదాబ్రోన్కియోలిటిస్ ఆబ్లిటెరాన్స్ అనేది కృత్రిమ వెన్న రుచులలో కనిపించే డయాసిటైల్ మరియు ఇలాంటి రసాయనాలను పీల్చడం వల్ల కలిగే తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధి. పెద్ద మొత్తంలో పీల్చే ఫ్యాక్టరీ కార్మికులకు ప్రమాదం ఎక్కువగా ఉన్నప్పటికీ, పిల్లలు సహా వినియోగదారులు ఈ సంకలితాలను కలిగి ఉన్న ఉత్పత్తులను తీసుకుంటే ఇప్పటికీ ప్రమాదంలో ఉన్నారు.ఈ రసాయనాలు ఊపిరితిత్తులలోని అతి చిన్న వాయుమార్గాలలో మచ్చలు మరియు సంకుచితానికి కారణమవుతాయి, దీని వలన దగ్గు, గురక మరియు శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి..
Read Also:Slaps Biker: సార్ మీరు.. రక్షక భటులా.. భక్షక భటులా..
ఈ వ్యాధి కొన్ని రసాయన సువాసన కారకాలను పీల్చడం వల్ల వస్తుంది, ముఖ్యంగా వెన్న రుచిని సృష్టించడానికి ఉపయోగించే డయాసిటైల్ అనే రసాయనం. డయాసిటైల్.. ఇతర సంబంధిత సమ్మేళనాలు ఊపిరితిత్తులలోని చిన్న గాలి సంచులు , వాయుమార్గాలను (బ్రోన్కియోల్స్) దెబ్బతీస్తాయి. ఈ నష్టం వాపు మచ్చలకు దారితీస్తుంది, ఇది వాయుమార్గాలను ఇరుకుగా చేస్తుంది .లోతుగా శ్వాస తీసుకోవడం కష్టతరం చేస్తుంది. మైక్రోవేవ్ పాప్‌కార్న్ ఇతర ఉత్పత్తులు వంటి కృత్రిమ రుచులు కలిగిన ఆహారాన్ని తీసుకోవడంతో పిల్లలకు ఈ ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం లేకపోలేదు.