కన్నడ స్టార్ నటుడు రిషబ్ శెట్టి హీరోగా, స్వయంగా దర్శకత్వం వహించి తీసిన అవైటెడ్ చిత్రం “కాంతారా చాప్టర్ 1” భారీ అంచనాల మధ్య విడుదలై, మొదటి భాగానికి ఏమాత్రం తగ్గకుండా మరోసారి డివోషనల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ముఖ్యంగా క్లైమాక్స్‌లో రిషబ్ శెట్టి చూపించిన నటన ప్రేక్షకులను కుర్చీలకు అతికిపోయేలా చేసింది. ఈ సారి కూడా నటనకు సంబంధించిన అనేక అవార్డులు రిషబ్‌దే అని ఫ్యాన్స్ నమ్మకం. అయితే ఇటీవల బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ ఒక స్టేజ్ ఈవెంట్‌లో రిషబ్ శెట్టి చేసిన అదే క్లైమాక్స్ వేరియేషన్‌ను ఇమిటేట్ చేసిన వీడియో వైరల్ అయ్యింది. ఇందులో రణ్వీర్ చేసిన హావభావాలు రిషబ్ శెట్టి నటనను “అవమానపరిచేలా ఉన్నాయి” అని సోషల్ మీడియాలో కొంతమంది నెటిజన్లు తీవ్రంగా విమర్శించారు. రణ్వీర్ రిషబ్‌ను రోస్ట్ చేశాడంటూ #Apologize Ranveer అంటూ పోస్టులు వెల్లువెత్తాయి.
Also Read : Samantha : బాధితురాలిగా బాగా నటించావు – పర్సనల్ స్టైలిష్ట్ షాకింగ్ కామెంట్స్
ఈ వివాదంపై రణ్ వీర్ సింగ్ స్వయంగా స్పందించాడు. తాను ఒక నటుడిగా, మరో నటుడి అద్భుతమైన నటనను హైలైట్ చేయడమే తన ఉద్దేశమని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరినీ అవమానపరచాలనే భావం లేదని ఆయన స్పష్టం చేశారు. భారత్‌లోని ప్రతీ ఆచారం, సంప్రదాయం పట్ల తనకు ఎంతో గౌరవం ఉందని, తన వల్ల ఎవరి భావోద్వేగాలు దెబ్బతిన్నా నిజంగానే క్షమాపణలు కోరుతున్నానని రణ్ వీర్ క్లారిటీ ఇచ్చారు. రణ్ వీర్ స్పందనతో ఈ కాంట్రవర్సీకి ఇక ముగింపు పలికినట్టే నని సినీ వర్గాలు భావిస్తున్నాయి.