ఈ ఆహార పదార్థాలు తీసుకున్నాక మంచినీరు తాగొద్దు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆహారం తిన్న తర్వాత వెంటనే మంచినీరు తాగడం మీకు అలవాటా.? కానీ ఈ ఆహార పోదార్థాలు తీసుకున్నాక మాత్రం అస్సలు నీటి జోలికి వెళ్లకండి.
భోజనానికి ముందు గానీ తినేప్పుడు లేదా తిన్న వెంటనే మంచి నీళ్లు తాగొద్దని పెద్దలు చెబుతుంటారు. నీరు తాగడం వల్ల జీర్ణ ప్రక్రియపై ప్రభావం పడే అవకాశం ఉండటమే దీనికి కారణం. మంచినీరు తాగడం వల్ల ఆహారం త్వరితంగా పేగుల్లోకి చేరుకుంటుంది. ఇది జీర్ణక్రియను దెబ్బతీస్తుంది. కొన్ని రకాల ఆహారం తీసుకున్నాక.. నీటిని తాగడం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అవేంటో చూద్దాం…
Also Read
- Jowar Roti: 'జొన్న రొట్టె' విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
- Bhindi Red Chilli Pachadi: వేడి వేడి అన్నంలో 'బెండకాయ పచ్చడి' వేసుకొని తింటే.. అబ్బో రుచి అదుర్స్ అంతే.!
- Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
- Chandipura virus: 22 మంది చిన్నారులు మృతి.. ఏమిటి చండీపుర వైరస్.? మెదడుపై ఎలా దాడి చేస్తుంది.?
పుచ్చకాయ:
పుచ్చకాయ తిన్న తర్వాత మంచినీళ్లు తాగితే కడుపులో ఇబ్బందిగా ఉంటుంది. ఆహారాన్ని శోషించుకోవడాన్ని, జీర్ణం కావడాన్ని నీరు నెమ్మదింపజేస్తుంది. ఫలితంగా కడుపులో ఆమ్లస్థాయిలు పెరిగిపోతాయి.
అరటి పండు:
అరటి పండు తిన్న తర్వాత మంచి నీళ్లు తాగొద్దని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా చల్లటి నీరు అస్సలే తాగ్గొద్దట. ఇలా చేస్తే తీవ్రమైన అజీర్తి సమస్య తలెత్తుందని హెచ్చరిస్తున్నారు. అరటి పండు తిన్నాక పావు గంట తర్వాతే నీళ్లు తాగాలని సలహా ఇస్తున్నారు.
వేరు శనగ:
వేరు శనగలు తిన్నాక మంచినీళ్లు తాగక పోవడమే మంచిది. వేరు శనగల్లో నూనె మోతాదులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని తినగానే నీటిని తాగడం వల్ల ఆహారనాళంలో కొవ్వులు పేరుకుపోతాయి. దగ్గు, గొంతు మంటకు ఇది దారి తీస్తుంది.
నిమ్మజాతి పండ్లు:
నిమ్మజాతి పండ్లలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. వీటిని తిన్నాక.. నీటిని తాగడం వల్ల పొట్టలో పీహెచ్ స్థాయిల్లో మార్పులు వస్తాయి. ఫలితంగా ఎసిడిటీ, అజీర్ణం, గ్యాస్ ఏర్పడటం లాంటి సమస్యలు తలెత్తుతాయి.
పాలు:
గోరు వెచ్చని పాలు తాగక మంచినీరు తాగితే కడుపు నొప్పి వస్తుంది లేదా పొట్టలో ఇబ్బందిగా ఉంటుంది. పాలు తాగాక నీరు తాగడం వల్ల జీవక్రియలు మందగిస్తాయి. పాలు తాగిన తర్వాత పొట్టలో ఆమ్లాలు ఉత్పత్తి అవుతాయి. కానీ నీటిని తాగడం వల్ల ఇవి పలుచన అవుతాయి. దీంతో శరీరం మరింతగా ఆమ్లాలు ఉత్పత్తి చేయాల్సి వస్తుంది. ఇది అసమతుల్యతకు దారి తీస్తుంది.
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్‌ఫ్లిక్స్‌లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!