Using earphones too much: ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఇయర్ ఫోన్స్ ఎక్కువగా వాడుతున్నారని.. అతిగా వాడితే ఆరోగ్యప్రమాదాలు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఇయర్ ఫోన్స్ ఎక్కువగా వాడితే వినికిడి సమస్యలు తప్పవు.. ఈ సమస్య తీవ్రంగా మారకముందే వైద్య నిపుణులను సంప్రదించండి. ఇయర్ ఫోన్స్ శరీరంలో భాగమైపోతున్నాయి. చెవుల్లో రోజంతా ఉండాల్సిందే.. లేకపోతే, చాలా మంది ఏదో కోల్పోయినట్లు భావిస్తారు. ఆఖరికి శబ్ధాలు దగ్గరుండి వినడం వల్ల వారిపై ఒత్తిడి రావడంతో వినికిడి సమస్యలు వస్తున్నాయి. అవి ఇతర ఆరోగ్య సమస్యలను కూడా కలిగిస్తాయి. చండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ లోతుగా పరిశోధన చేసింది. యువత వినికిడి సమస్యకు ప్రధాన కారణం ఇయర్ ఫోన్స్ ఎక్కువగా వాడడమేనని అన్నారు. వీటిని అతిగా వాడితే సమస్య పెరుగుతుందని నిర్ధారణ అయింది. నిజానికి 50 ఏళ్ల తర్వాత సహజంగానే వినికిడి సమస్యలు వస్తాయి.
Read also: RTC Chairman Bajireddy: ఇదొక డ్రామా.. ఈడీ నోటీసులపై బాజిరెడ్డి స్పందన..
అయితే ఇప్పుడు 20 ఏళ్లకే ఈ సమస్యలు వస్తున్నాయి.. దీనికి ప్రధాన కారణం చిన్నప్పటి నుంచి శబ్దానికి అతిగా అలవాటు పడటమే. ఇయర్ ఫోన్స్ వచ్చిన తర్వాత ఈ సంఖ్య ప్రతిరోజూ పెరుగుతుంది. అయితే ఈ ఇయర్ ఫోన్స్ వచ్చిన తర్వాత ఈ రోజుల్లో నలుగురిలో ముగ్గురుకి వినికిడి సమస్యలు వస్తున్నాయి. యువతలో ఈ సమస్య తీవ్రతరంగా మారుతుంది. దురద లేదా నొప్పి వంటి సంకేతాలు ఉంటే చెవి సమస్యల యొక్క మొదటి లక్షణం వినికిడి సమస్యలు. లేటెస్ట్ హైటెక్ ఇయర్ ఫోన్స్ కొత్తవి, బెటర్ గా ఉన్నా ప్రమాదమేమీ లేదని అంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 110 మిలియన్ల మంది యువకులు ఈ సమస్యలను ఎదుర్కొంటారు. అయితే ప్రపంచవ్యాప్తంగా 43 కోట్ల మంది చెవిటితనంతో బాధపడుతున్నారని ఈ పరిశోధనలో వెల్లడైంది. భారతదేశంలో దాదాపు 60 లక్షల మందికి వినికిడి సమస్యలు ఉన్నాయి. మీకు ఇయర్ ఫోన్స్ వాడే అలవాటు ఉంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. అరగంట పాటు వీటిని వాడాలనుకుంటే పది నిమిషాల పాటు చెవులకు బ్రేక్ ఇవ్వండి లేదంటే ఆరోగ్యం దెబ్బతింటుంది.
Bandi Sanjay: బీజేపీ కి దర్యాప్తు సంస్థలకు సంబంధమే లేదు