NTV Telugu Site icon

Health Tips for Bloating Problem: కడుపు ఉబ్బరంగా ఉందా? ఈ ఫుడ్స్ ట్రై చేయండి

Stomach Health

Stomach Health

ఈమధ్యకాలంలో వివిధ అనారోగ్య సమస్యలు తరచూ వేధిస్తున్నాయి. కడుపు ఉబ్బరంగా ఉందని చాలామంది అంటుంటారు. కడుపు ఉబ్బరం సమస్య తలెత్తడానికి మలబద్ధకం, గాలిని మింగడం, సరిగ్గా లేదా సరైన సమయానికి తినకపోవడం వంటి చాలా కారణాలు ఉంటాయి. వీటితోపాటు మనం తరచూ తినే ఆహార పదార్థాలు కూడా బ్లోటింగ్ సమస్యకు దారితీస్తాయి. చాలా మంది తాము ఆ ఫుడ్ తింటే పడడం లేదని, కడుపు బరువుగా ఉంటోందని ఫిర్యాదు చేస్తుంటారు. తమకు కొన్ని ఆహార పదార్థాలు పడవని తెలిసినా తీసుకుంటూ ఉంటారు. ఫలితంగా కడుపు ఉబ్బినట్లుగా ఉంటుంది. ఎందరు ఏం తినకపోయినా గ్యాస్‌ సమస్యలతో బాధపడుతుంటారు.

Read Also: Astrology: జనవరి 09, సోమవారం దినఫలాలు

వివిధ రకాల ఆహారాలు తినడం వల్ల ఎసిడిటీ, మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలు వస్తుంటాయి. ఒకవైపు, కొన్ని పదార్థాలు తినడం వల్ల కడుపు నొప్పి వస్తుంటుంది. జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలను కొన్ని వంటింటి చిట్కాలతో నయం చేసుకోవచ్చు. ఈ చిట్కాల వల్ల మీ ఆరోగ్యం కుదుట పడడమే కాదు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ దరిచేరవు.

*ఉదయం లేచిన వెంటనే టీ, కాఫీలు తాగకుండా ఒక గ్లాసు వేడి నీరు తాగండి. ఇలా చేయడం వల్ల బాడీలో మలినాలు తొలగిపోతాయి.

* అలాగే పెరుగు, మజ్జిగ ఎక్కువగా తీసుకోవడం మంచిది. పెరుగు కడుపుకు మేలు చేస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. పెరుగులో ఉండే లక్షణాలు జీర్ణక్రియను పెంచుతాయి. ఇందులో ఉండే మంచి బ్యాక్టీరియా పేగులను ఆరోగ్యంగా ఉంచి, జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలను దూరం చేస్తుంది.

* మజ్జిగలో ఉండే ఎంజైమ్‌లు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. మజ్జిగలో జీలకర్ర, పెసరపప్పు, నల్ల ఉప్పు వేసి కడుపులో మంట ఉంటే తాగాలి. ఈ విధంగా, తక్షణ ఉపశమనం కలుగుతుంది.

* కడుపు ఉబ్బరం ఉన్నపుడు జీలకర్ర పొడిని పెరుగులో కలిపి తింటే సమస్య నుంచి బయటపడొచ్చు.

* సోంపు జీర్ణక్రియకు బాగా ఉపయోగకరంగా ఉంటుంది. చాలామంది సోంపుగింజలను భోజనం తర్వాత తీసుకుంటుంటారు. సోంపును నీటిని తాగితే జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. కడుపు ఉబ్బిన తర్వాత నీళ్లలో నానబెట్టిన సోంపు వాటర్‌ను తాగితే గ్యాస్‌, మలబద్ధకం సమస్యలు మీ నుంచి దూరం అవుతాయి.

* మీకు ఫ్రూట్స్ తినే అలవాటు ఉంటే.. బొప్పాయి తినండి. అది జీర్ణక్రియకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. బొప్పాయిలో ఉండే పపైన్ జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలను దూరం చేస్తుంది. బొప్పాయి తినడం వల్ల గ్యాస్, అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వుండవు. బొప్పాయిలో నల్ల ఉప్పు కలిపి తింటే ఇంకా మేలు జరుగుతుంది.

* వామ్ము తిన్నా కూడా కడుపు ఉబ్బరం సమస్యలు దూరం అవుతాయని డాక్టర్లు సూచిస్తున్నారు.

Read Also: Cold Wave: తెలంగాణపై చలి పులి పంజా.. సంగారెడ్డి జిల్లాలో అత్యల్పం