డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో మనకు తెలుసు.. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు వీటిని తింటారు.. బాదాం ను ఎక్కువగా ఈ మధ్య తింటున్నారు.. అయితే ఈ బాదాం ను మహిళలు తీసుకోవడం వల్ల కలిగే లాభలేంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..
ముఖ్యంగా 30 ఏళ్లు దాటిన తర్వాత మహిళలు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఎందుకంటే వయస్సు పెరుగుతున్న కొద్దీ మహిళలు అలసట, చిరాకు, అనేక వ్యాధుల ప్రమాదాన్ని ఎదుర్కొంటారు.. వయస్సు పెరిగే కొద్ది ఆరోగ్యం కూడా క్షీనిస్తుంది.. అయితే వాళ్లు బాదం తీసుకోవడం వల్ల విటమిన్ ఇ, కాల్షియం, కొవ్వు,ప్రోటీన్లు, పోషకాలు పుష్కలంగా ఉన్నాయి..
మహిళలు వీటిని తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. బాదంలో మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇది LDL కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.. గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది..
బాదంలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రొటీన్లు, పీచు పదార్ధాల కలయిక సంతృప్తిని పెంచడంలో సహాయపడుతుంది. మీరు నిండుగా, తృప్తిగా అనుభూతి చెందేలా చేస్తుంది.. క్యాలరీలను బాగా తగ్గిస్తుంది..
విటమిన్ ఇతో సహా యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కణాలను ఆక్సీకరణ నష్టం నుండి రక్షించడంలో సహాయపడతాయి. యాంటీఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యానికి తోడ్పడడంలో పాత్ర పోషిస్తాయి..
బాదాంలో కాల్షియం మంచి మూలం. ఇది కీళ్లను బలంగా, ఆరోగ్యంగా ఉంచడానికి అవసరం. మహిళలకు కాల్షియం చాలా ముఖ్యం.. ఈ వయస్సులో వచ్చే ఎముకల వ్యాధులను నివారిస్తుంది.. భోజనంతో పాటు బాదంపప్పును తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడవచ్చు. ఇది ఇన్సులిన్ నిరోధకత లేదా మధుమేహం ఉన్న మహిళలకు బాదాం తీసుకోవడం మంచిది.. అయితే థైరాయిడ్ ఉన్న మహిళలు వైద్యుల సలహా తీసుకొని తీసుకోవడం మంచిది..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.