నెయ్యిని ఎప్పటి నుంచో తింటున్నారు.. నెయ్యిని రోజు తీసుకోవడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు రావని నిపుణులు చెబుతున్నారు.. రోగనిరోధక శక్తిని పెంచడం, కంటి చూపు వంటి ఇతర ఆరోగ్య ప్రయోజనాలకు నెయ్యిని సిఫార్సు చేస్తుంది.. నెయ్యిని పప్పు, పచ్చళ్ళ తో పాటు అనేక రకాలుగా తీసుకోవచ్చు.. నెయ్యి వంటలకు రుచిని పెంచడంతో పాటు అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది.. నెయ్యిని ఎలా తీసుకుంటే మంచి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
శరీరానికి అవసరమైన పోషకాలను, విటమిన్లు A, D, E మరియు K నుండి ఒమేగా-3 , ఒమేగా-6 వంటి ఆరోగ్యకరమైన కొవ్వు ఆమ్లాలను అందిస్తుంది, ఇవి మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.. ఇకపోతే నెయ్యిని రోజు ఉదయం పరగడుపున తీసుకోవడం మంచిదా అనే సందేహం అందరికి కలుగుతుంది..నెయ్యి జీర్ణక్రియకు మేలు చేస్తుందని మనందరికీ తెలుసు, కాని ఉదయం ఖాళీ కడుపుతో నెయ్యి తీసుకోవడం సరైందే, ఎందుకంటే ఇది జీర్ణక్రియకు గొప్పది. అలాగని ఉదయం తీసుకోవటం వల్ల మేలు కలుగుతుందని చెప్పలేము..
అయితే ఉదయం తీసుకొనేవాళ్లు అలాగే చల్లగా కాకుండా వేడి చేసుకొని తీసుకోవడం మంచిది..పప్పును తయారుచేసేటప్పుడు అందులో కొద్దిగా నెయ్యిని జోడించటం, కూరగాయలను వేగుతున్నప్పుడు నెయ్యి వేయటం చేయాలి. ఈ విధంగా మీరు నెయ్యి యొక్క అన్ని ప్రయోజనాలను ఆస్వాదించవచ్చు.. వేడి వేడి ఆహార పదార్థాలలో ఈ నెయ్యిని వేసుకొని తినడం చాలా మంచిది.. ఇక పిల్లలకు కూడా వేడి అన్నంలో కలిపి ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ఒక్క ఉదయం మాత్రమే కాదు.. ఎప్పుడు తీసుకున్నా కూడా వేడి చేసి తీసుకోవడం మేలు..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.