బార్లీ గింజల గురించి ఈరోజుల్లో చాలా మందికి తెలియక పోవచ్చు కానీ ఆరోజుల్లో ఎక్కువగా వీటిని తినేవాళ్లు.. అందుకే వాళ్లు ఇప్పటికి చాలా ఆరోగ్యంగా ఉన్నారు.. బార్లీ గింజలు చూడటానికి గోదుమలను పోలి ఉంటాయి. అయితే గోదుమలు కన్నా బార్లీ గింజలలో ఎన్నో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. వీటితో తయారు చేసిన నీటిని రోజు పొద్దున్నే ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ముందుగా బార్లీ నీటిని ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం. పొయ్యి మీద గిన్నె పెట్టి రెండు గ్లాసుల నీటిని పోసి రెండు స్పూన్ల బార్లీ గింజలను వేసి 5 నుంచి 7 నిమిషాల పాటు మరిగించాలి. మరిగిన ఈ నీటిని గ్లాస్ లోకి వడకట్టి దానిలో ఒక స్పూన్ నిమ్మరసం, అరస్పూన్ తేనె కలిపి తాగాలి.. ఈ నీటిని తాగడం వల్ల శరీరంలో వేడిని తగ్గిస్తుంది. కడుపులో గ్యాస్,కడుపు ఉబ్బరం,కడుపు నొప్పి వంటి సమస్యలను తగ్గిస్తుంది.
డయబెటిస్ ఉన్నవారు ప్రతి రోజు తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండటమే కాకుండా డయబెటిస్ కారణంగా వచ్చే నీరసం,అలసట వంటివి లేకుండా చేస్తుంది.. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గేలా చేస్తుంది.. అలాగే రక్తప్రసరణ బాగా జరిగేలా చేసి రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. దాంతో గుండెకు సంబందించిన సమస్యలు ఉండవు. అధిక బరువుతో బాధపడేవారు ఉదయం,సాయంత్రం బార్లీ నీటిని తీసుకుంటే చాలా మంచిది.. మూత్రపిండాల సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి.. ఇంకా ఎన్నో సమస్యలు తగ్గిపోతాయి..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.