మారిన వాతావరణం, ఆహారపు అలవాట్లు కారణంగా అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి.. మందులు లేని కొత్త కొత్త రోగాలు కూడా పుట్టుకోస్తున్నాయి.. దాంతో జనాలు ఇప్పుడు ప్రకృతి వైద్యం వైపు పరుగులు తీస్తున్నారు.. అందులో ఈ మధ్య మునగాకు పేరు ఎక్కువగా వినిపిస్తుంది.. ఈ ఆకును రోజు తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు.. ఎలా తీసుకుంటే మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఉదయాన్నే నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో మునగాకు నీళ్లను తాగితే శరీరంలో అనేక మార్పులు వస్తాయి.. బరువు తగ్గడంతో పాటు, రక్తంలో చక్కర స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి.. రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఒక నెల పాటు నిరంతరంగా మునగాకు నీటిని తాగితే శరీరంలో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో ఇప్పుడు ఒకసారి చూద్దాం..
ప్రతి రోజూ ఉదయం ఖాళీ కడుపుతో మునగ ఆకు నీటిని తాగండి. ఇది శరీరంలోని జీవక్రియను పెంచడంతో పాటు మరియు వేగంగా బరువు తగ్గడంలో సహాయపడుతుంది.. మెటబాలిజం ను పెంచుతుంది..
మునగాకు శరీరం యొక్క జీవక్రియను పెంచడానికి మరియు బరువు నియంత్రణలో ఉంచడానికి సహాయపడుతుందని ఒక అధ్యయనం కనుగొంది. అలాగే ఉదయాన్నే పరగడుపున ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగడం వల్ల క్యాలరీలు కరగడంతో పాటుగా యాక్టివ్ గా కూడా ఉంటారు..
మునగ ఆకు నీటిని తాగడం వల్ల శరీరంలోని బ్లడ్ షుగర్ లెవెల్ అదుపులో ఉంటుంది. ఎందుకంటే మునగలో ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరిచే సమ్మేళనాలు ఉంటాయి. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ నీటిని తాగితే రక్తంలో చక్కరను అదుపులో ఉంచుతుంది..
ఇందులో ఉండే అదనపు పీచు జీర్ణవ్యవస్థ కార్యకలాపాలను పెంచి, పేగులను క్రమబద్ధీకరించి, మలబద్ధకాన్ని నివారిస్తుంది..
శరీరంలోని మాలినాలను బయటకు పంపిస్తుంది.. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక చెంచా మునగ పొడిని మిక్స్ చేసి ఉదయం నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో త్రాగాలి. దీన్ని రోజూ తాగితే శరీరంలోని టాక్సిన్స్ తొలగిపోయి చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి.. ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.