సోడా తాగితే తిన్న ఆహారం అరుగుతుందని, గ్యాస్ పట్టకుండా రోజు తాగుతారు.. ఇలా బయటి ఫుడ్ ఏం తిన్నా సాఫ్ట్ డ్రింక్స్ కంపల్సరీ తాగుతాం. వాటిలో షుగర్, ఇతర రసాయనాలు కలుస్తాయని కొంతమంది సోడా తాగుతారు… రోజు తాగితే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని రోజూ తాగుతారు.. సమ్మర్ లోనే కాదు, వింటర్ లో కూడా చాలామంది తాగుతారు.. అలా తాగితే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.. అవేంటో తెలుసుకుందాం..
ఈ సోడాను ఎక్కువగా తాగడం వల్ల బరువు సులువుగా పెరుగుతారు. వీటిలో అధికంగా చక్కెర కలిపి ఉంటుంది. అలాగే ఫ్రక్టోజ్ సిరప్ కూడా నిండి ఉంటుంది. ఎలాంటి పోషక విలువలు ఉండవు. కేవలం అదనపు క్యాలరీలు మాత్రమే శరీరానికి అందుతాయి. శక్తి వినియోగంలో, వ్యయంలో అసమతుల్యత ఏర్పడుతుంది. ఫలితంగా శరీరం బరువు పెరుగుతుంది.. దాంతో గుండె జబ్బులు, కీళ్ల సమస్యలు, ఊబకాయం వంటివి వచ్చే అవకాశం ఎక్కువ..
అలాగే సోడాను ఇలా ఎక్కువగా తాగితే..వీటిలో కొద్దిగా చక్కర ఉంటుంది.. దాంతో రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. ఇవి దంతాలకు కూడా హాని చేస్తాయి. ఆమ్లత్వం, చక్కెర అధికంగా ఉండటం వల్ల దంతాల ఎనామిల్ దెబ్బతింటుంది. నోటి బ్యాక్టీరియా పెరిగి.. చిగుళ్లవాపు, పీరియాంటల్ వంటి వ్యాధి వంటివి వచ్చే అవకాశం ఉంది. కాలేయంలో కొవ్వు పేరుకుపోయి ఈ సమస్య మొదలవుతుంది. సోడాలలో కెఫిన్ కూడా అధికంగానే ఉంటుంది.. అంతగా సోడాను తాగాలని అనిపిస్తే ఎప్పుడో ఒక్కసారి తాగితే మంచిది.. వీటికి బదులుగా పండ్ల రసాలను తీసుకోవడం మంచిది. సోడా ప్రియులు ఇది దృష్టిలో ఉంచుకొని తాగితే మంచిది..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.