రోజూ ఉదయం లేవగానే టీ తాగే అలవాటు అందరికీ ఉంటుంది.. అయితే కొంతమంది అల్లం టీని ఎక్కువగా తాగడానికి ఇష్ట పడతారు.. మరికొందరికి కేవలం జలుబు చేసిన సమయంలో లేదంటే చలికాలంలో మాత్రమే వీటిని తాగుతూ ఉంటారు… ఆరోగ్యానికి మంచిదని ఎక్కువగా తాగేస్తూ ఉంటారు.. అలా చెయ్యడం డేంజర్ అని, ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.. రోజూ అల్లం టీ తాగితే కలిగే నష్టాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
సాధారణంగా జలుబు, దగ్గు ఉన్న అల్లం టీని తాగుతూ ఉంటారు. ఆ సమయంలో మంచి ఉపశమనం కలుగుతుంది. అయితే వర్షాకాలం, శీతాకాలంలో చాలామంది ఈ అల్లం టీ ని తాగడానికి ఎక్కువ మక్కువ చూపిస్తూ ఉంటారు. కానీ అది ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. అల్లం లో యాంటీ ప్లేట్లెట్స్ ఉంటాయి. అల్లం లోని ఈ గుణాలు రక్తస్రావాన్ని కలిగిస్తాయి.. మసాలా దినుసులు వేసుకొని తాగితే మరిన్ని అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు..
అల్లం తక్కువ పరిమాణంలో తీసుకుంటే ఇది మేలు చేస్తుంది. అల్లం ఎక్కువగా తీసుకుంటే ఉదర సంబందిత సమస్యలు కూడా వస్తాయి. అలాంటి ఎక్కువగా తీసుకోవడం వలన డయేరియా వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. జీర్ణ కోసం వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది.. తో తయారు చేసిన టీ ని ఎక్కువగా తాగడం మానుకోవాలి. అల్లం పరిమిత పరిమాణంలో తీసుకుంటే దాని వలన చాలా ఉపయోగాలు ఉంటాయి. కానీ రుచి కోసం అవసరానికి మించి అల్లం తీసుకోవడం వలన గుండెల్లో మంట, కడుపు నొప్పి మొదలైన ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.. అందుకే ఈ టీని ఎంత తగ్గువగా తీసుకుంటే అంత మంచిదని నిపుణులు చెబుతున్నారు..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.