ఉదయాన్నే కాఫీ లేదా టీ తాగితేనే రోజు మొదలవుతుంది అనే వారు చాలా మంది ఉంటారు. ముఖ్యంగా చలికాలంలో చాలామంది విపరీతంగా ఛాయ్, కాఫీ తాగుతుంటారు. అయితే ఇలా నిరంతరం టీ, కాఫీ ఎక్కువ మొత్తంలో తీసుకోవడం ఆరోగ్యానికి హానికరమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధికంగా కేఫిన్ తీసుకోవడం వల్ల గుండె సమస్యలు, నిద్రలేమి, ఆందోళన వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందన్నారు. అందువల్ల రోజులో టీ–కాఫీలను పరిమిత మోతాదులో మాత్రమే తీసుకోవాలని సూచిస్తున్నారు.
టీ, కాఫీ తాగడం ఒక సాధారణ అలవాటు. కానీ కొంతమంది రోజుకు ఎక్కువసార్లు తీసుకుంటుంటారు. ముఖ్యంగా టీ లో అధికంగా కేఫిన్ ఉండటం వలన దాని ప్రభావం శరీరంపై ప్రతికూలంగా పడుతుంది. అధిక కేఫిన్ కారణంగా ఆందోళన, నిద్రలేమి, ఒత్తిడి, గుండె వేగం పెరగడం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే టీ లో ఉండే టానిన్లు ఎక్కువగా తీసుకుంటే దంత సమస్యలు కూడా రావచ్చు. అదనంగా రోజులో అనేకసార్లు టీ తాగడం వల్ల గ్యాస్, కడుపు నొప్పి, అసిడిటీ వంటి సమస్యలు రావచ్చని వైద్యులు చెబుతున్నారు. ప్రత్యేకంగా ఉదయం లేవగానే టీ తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
టీ ఆకుల్లో స్వయంగా పెద్దగా కేలరీలు ఉండవు. గ్రీన్ టీ, బ్లాక్ టీ లాంటివి వేడి నీటితో కలిపి తాగితే కేవలం 250 ml లో సుమారు 3 కేలరీలు మాత్రమే ఉంటాయి. అంతేకాదు టీ లో యాంటీ ఆక్సిడెంట్లు ఉండటంతో ఆరోగ్యానికి కొన్ని విధాలుగా మేలు చేస్తాయి. అయితే టీలో పాలు కలిపితే దాని కేలరీలు గణనీయంగా పెరుగుతాయి. రోజుకు అనేకసార్లు పాలతో టీ తాగే అలవాటు బరువు పెరగడానికి కూడా కారణమవుతుందని న్యూట్రిషియన్లు చెబుతున్నారు.
మొత్తానికి, టీ–కాఫీ పరిమితంగా తీసుకుంటే ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. కానీ అధికంగా తీసుకుంటే శరీరంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ సమాచారం అంతా మేము ఇంటర్నెట్ నుంచి గ్రహించాం. మీరు దీన్ని ఫాలో అయ్యేముందు న్యూట్రిషన్ సంప్రదించడం ఉత్తమం.