ఉదయాన్నే కాఫీ లేదా టీ తాగితేనే రోజు మొదలవుతుంది అనే వారు చాలా మంది ఉంటారు. ముఖ్యంగా చలికాలంలో చాలామంది విపరీతంగా ఛాయ్, కాఫీ తాగుతుంటారు. అయితే ఇలా నిరంతరం టీ, కాఫీ ఎక్కువ మొత్తంలో తీసుకోవడం ఆరోగ్యానికి హానికరమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధికంగా కేఫిన్ తీసుకోవడం వల్ల గుండె సమస్యలు, నిద్రలేమి, ఆందోళన వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందన్నారు. అందువల్ల రోజులో టీ–కాఫీలను పరిమిత మోతాదులో మాత్రమే తీసుకోవాలని సూచిస్తున్నారు. టీ, కాఫీ…