Rice Water: బియ్యం కడ నీళ్లు పడేస్తున్నారా? ఇలా చేయండి..
- బియ్యం కడిగిన నీటిలో చాలా పోషకాలు..
- బియ్యం కడిగిన నీటిని మరిగించి తాగడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది..
- ఇది జుట్టు రాలడం, చిట్లడం వంటి సమస్యలను తగ్గిస్తుంది..
- రైస్ వాటర్ చర్మానికి చాలా మేలు చేస్తుంది..
- బియ్యం కడిగిన నీరు గుండె ఆరోగ్యానికి మంచిది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rice Water: చాలా మంది బియ్యం కడిగిన నీటిని పారేస్తారు. కానీ బియ్యం కడిగిన నీటిని పారేయడం కంటే వాటిని ఉపయోగించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని చెబుతారు. బియ్యం కడిగిన నీటిలో చాలా పోషకాలు ఉన్నాయని, ముఖ్యంగా బి విటమిన్, ఇ విటమిన్, భాస్వరం, పొటాషియం మరియు తక్కువ మొత్తంలో గంజి ఉంటాయని చెప్పారు. బియ్యం కడిగిన నీటిని వాడటం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుందని, జుట్టుకు కూడా మంచిదని చెబుతారు. మనకు ప్రధాన ఆహారం అయిన అన్నం వండడానికి బియ్యం కడిగినప్పుడు, సహజంగా కడిగిన నీటిని పారేస్తాము.

Also Read
- Bats: గబ్బిలాల శరీరంలో దాగిన భయంకర రహస్యం..!
- Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
- Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే 'రాగి మునగాకు రొట్టె' చేసేయండి ఇలా.!
- Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
బియ్యం కడిగిన నీరు మన జుట్టు ఆరోగ్యానికి ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. బియ్యం కడిగిన నీటిలో ఉండే అమినో యాసిడ్స్, విటమిన్లు, మినరల్స్ మన జుట్టు సంరక్షణకు ఎంతగానో తోడ్పడతాయి. శుభ్రంగా తలస్నానం చేసిన తర్వాత బియ్యం కడిగిన నీళ్లను జుట్టుపై పోసి మర్దన చేస్తే అందులోని పోషకాలు మన వెంట్రుకల కుదుళ్లలోకి చేరుతాయి. ఇది జుట్టు రాలడం, చిట్లడం వంటి సమస్యలను తగ్గిస్తుంది. అంతేకాదు బియ్యం కడిగే నీటిలో ఇనోసిటాల్, ఫైటిక్ యాసిడ్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి మన చర్మాన్ని మృదువుగా మెరిసేలా చేస్తాయి. రైస్ వాటర్ చర్మానికి చాలా మేలు చేయడమే కాకుండా.. చర్మాన్ని కాపాడుతుంది, తేమను అందిస్తుంది, ముఖంపై మంటను తగ్గిస్తుంది. బియ్యం కడిగిన నీటిని మరిగించి తాగితే, అది మన జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. మలబద్ధకం, అజీర్తిని నివారిస్తుంది.

బియ్యం కడిగిన నీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఈ నీటిని మరిగించి తాగడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. కాబట్టి ఇది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. బియ్యం కడిగిన నీరు గుండె ఆరోగ్యానికి మంచిది. రక్తపోటును తగ్గిస్తుంది. ఇది మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది. అవి మన శరీరానికి కావలసిన శక్తిని అందిస్తాయి. పూర్వం అన్నం వండేటప్పుడు గంజి పోసి గంజి తాగేవారు. గంజిని తీసుకోవడం వల్ల శరీరానికి శక్తిని అందించడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్‌ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?