Happy Fathers Day: అమ్మ తొమ్మిది నెలలు మోసి జన్మనిస్తే.. నాన్న తన జీవితమంతా పిల్లలను మోస్తాడు. నిస్వార్థ ప్రేమతో గుండెల మీద ఆడుకుంటూ జీవితానికి మార్గం చూపే మార్గదర్శి తండ్రి. మా నాన్న తన పిల్లల ఎదుగుదల కోసం కష్టపడే వ్యక్తి. ఆయన త్యాగం, సహనం వెలకట్టలేనివి. అప్పు తీర్చలేనిది. అందుకే, మన ఎదుగుదల మరియు జీవితంలో ఇంత ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న తండ్రిని గౌరవించటానికి మేము ఫాదర్స్ డేని జరుపుకుంటాము. ప్రతి సంవత్సరం జూన్ మూడో వారంలో జూన్ 16న ఫాదర్స్ డే జరుపుకుంటాం. అలాంటి నాన్నతో ఏడాది మొత్తం గడిపినా తక్కువే అని చెప్పాలి. మదర్స్ డే అంటే తల్లులను ఎలా గౌరవిస్తారో… తండ్రుల గొప్పతనాన్ని గుర్తించేందుకు ఈ ఫాదర్స్ డే జరుపుకుంటారు. పిల్లల విజయాల కోసం నాన్న నిస్వార్థంగా ఉంటారు.
Read also: Jagadish Reddy: గతంలో ఒప్పుకుని ఇప్పుడు అభ్యంతరమా? జగదీష్ రెడ్డి సీరియస్
నాన్న చేసిన త్యాగాలు, నిర్వహించే బాధ్యతల గురించి ఎంత చెప్పినా తక్కువే. నాన్న మాటల్లో ప్రేమ వెలకట్టలేనిది. నాన్న కోపంలో పిల్లలపై బాధ్యత ఉంటుంది. అణుక్షణం బిడ్డల గురించే ఆలోచన చేస్తూ కుటుంబ భారాన్ని మోస్తూనే ఉంటాడు. అటువంటి నాన్నను అర్థం చేసుకుంటే ఆయన ప్రేమ సముద్రం. నాన్న కోపంలో బాధ్యతను చూసిన ప్రతి వ్యక్తి జీవితంలో తొలి మెట్టుపై ఉండటం సత్యం. అలాంటి నాన్న కోసం మనం ఎంత చెప్పుకున్నా చాలా తక్కువ. సముద్రాన్ని ఈదడం ఎంత కష్టమో.. నాన్న ప్రేమను అర్థం చేసుకోవడం కూడా ఇంకా కష్టం. ప్రేమ, కోపం, బాధత్య కలిగిన అలాంటి వ్యక్తి గొప్పతనాన్ని కచ్చితంగా అందరం సెలబ్రేట్ చేసుకోవాల్సిందే. అలాంటి అందుకోసమే ప్రతి ఏడాది జూన్ నెలలోని మూడో ఆదివారం అంతర్జాతీయ పితృ దినోత్సవాన్ని నిర్వహించుకుంటాం.
Bihar : పాట్నాలో భారీ ప్రమాదం.. గంగలో పడవ బోల్తా ఆరుగురు గల్లంతు