Ghosts in Dreams: దేవుడు ఉంటే దెయ్యాలు సైతం ఉంటాయి. ఈ వ్యాఖ్యాన్ని చాలా సార్లు వినే ఉంటాం. దెయ్యాలు ఉన్నాయా? మనిషి చనిపోయాక అతని ఆత్మ దెయ్యంగా మారుతుందా? ఎవరి మీద కోపం ఉంటే వారి పై పగ తీర్చుకుంటాయా? ఇలాంటి రకరకాల ప్రశ్నలు తరచూ వస్తుంటాయి దెయ్యాలు రాత్రి పూట మాత్రమే ఎందుకు కనిపిస్తాయనే సందేహం సైతం మీకు వచ్చే ఉంటుంది. దెయ్యాలు, భూతాలు ఉంటాయి అనేది.. మనుషుల నమ్మకాలను బట్టి ఉంటుంది. ఇది పక్కన పెడితే.. కొందరికి తరచూ కలలో దెయ్యాలు కనిపిస్తున్నాయని చెబుతుంటారు. కంగారు పడుతూ ఆందోళన చెందుతుంటారు. నిద్ర మధ్యలో సడెన్‌గా బెడ్‌పై నుంచి లేచి కూర్చుంటారు. ముఖమంతా చెమటలు.. చుట్టూ చూస్తే అంతా నార్మల్ గా ఉంది.. ఏం జరిగిందని అడిగితే తడబడుతూ దెయ్యం కనిపించిందని చెబుతుంటారు. నిజంగానే దెయ్యాలు కలలో కనిపిస్తాయా? ఇలా కనిపించడానికి కారణం ఏంటనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
READ MORE: BSNL: నెట్‌వర్క్ లేకుండానే కాల్స్.. VoWiFi సర్వీస్ ప్రారంభించిన బీఎస్ఎన్ఎల్
డ్రీమ్ సైన్స్ ప్రకారం.. కలలో దెయ్యాలు కనిపించడం అనేది చెడు సంకేతం. మీ చుట్టూ నెగెటివ్ ఎనర్జీ ఉన్నట్లు సంకేతం. మానసికంగా బలంగా లేరని అర్ధం. మానసికంగా ధృడంగా ఉన్నవారు .. జీవితంలో ఎన్నో సాధించాలని, ముందుకు వెళ్లాలని చూస్తూ ఉంటారు. అలాంటివారు నిద్ర పోయేముందు రేపు ఇంకా బెటర్ గా ఉండాలని మనసులో అనుకోని పడుకుంటారు. కానీ, మానసికంగా బలం లేనివారు రేపు ఏం జరుగుతుందో అనే భయంతో పడుకుంటారు. దానివలన వారి మనసులో ఉన్న భయం దెయ్యాల రూపంలో కలలోకి వస్తాయని డ్రీమ్ సైన్స్ చెప్తుంది. అంతేకాకుండా కొందరు ఎమోషనల్ గా ఉన్నప్పుడు.. జీవితంలో ఏదైనా నచ్చింది కోల్పోయినప్పుడు, ఉద్యమ నుంచి ఒకే విషయం గురించి ఆలోచించినప్పుడు కూడా ఇలా దెయ్యాలు కల్లోకి వస్తాయట. ఇక దెయ్యంతో మీరు పోరాడినట్లు కలలో కనిపిస్తే.. భవిష్యత్ లో మీరు సాధించే విజయానికి ఏదో అడ్డుపడుతున్నట్లు తెలిపే సంకేతమని చెప్తున్నారు.
READ MORE: Nobel Prize History: రేపటి నుంచే నోబెల్ బహుమతుల ప్రదానం.. మొదటి సారి ఎప్పుడు ఇచ్చారో తెలుసా!