సాయంత్రం అయితే చాలా మందికి ఏదోకటి తినాలని అనుపిస్తుంది..అయితే రోజూ చేసుకునేలాకాకుండా కొత్తగా ట్రై చెయ్యాలానుకొనేవాళ్ళు పెసరపప్పు తో పకోడీలను చేసుకోండి..రుచిగా ఉండటంతో పాటు, హెల్త్ కు చాలా మంచిది కూడా.. ఇక ఆలస్యం ఎందుకు వింటుంటే నోరు ఊరిపోతుంది కదూ..వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కరకరలాడుతూ రుచిగా ఉండే ఈ పెసరపప్పు పకోడీలకు ఏం పదార్థాలు కావాలి.. ఎలా తయారు చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం…
కావలసిన పదార్థాలు :
పెసరపప్పు –పావు కిలో
సన్నగా తరిగిన ఉల్లిపాయ – 1,
సన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2,
సన్నగా తరిగిన కొత్తిమీర – పావు కప్పు,
అల్లం తరుగు – అర టీ స్పూన్,
జీలకర్ర – అర టీ స్పూన్,
కారం – అర టీ స్పూన్,
పసుపు – పావు టీ స్పూన్,
ఉప్పు – తగినంత,
నూనె – డీప్ ఫ్రైకు సరిపడా..
తయారీ విధానం :
ముందుగా పెసరపప్పును బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి.. తరువాత తగినన్ని నీళ్లు పోసి 2 నుండి 3 గంటల పాటు నానబెట్టాలి. తరువాత నీటిని వడకట్టి పెసరపప్పును ఒక జార్ లోకి తీసుకోవాలి.. కొంచెం పలుకుగా ఉండేలా మిక్సీ పట్టుకోండి.. ఆ తర్వాత పైన చెప్పిన పదార్థాలను ఒక్కొక్కటిగా వేసుకొని బాగా కలుపుకోవాలి.. డీ ప్రై కు సరిపడా ఆయిల్ పెట్టి పకోడీలను వేసుకోవాలి.. సిమ్ లో పెట్టుకొని బాగా ఎర్రగా కాల్చుకోవాలి.. ఈ పకోడీలను అటూ ఇటూ తిప్పుతూ క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చే వరకు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పెసరపప్పు పకోడీలు తయారవుతాయి. వీటిని చట్నీ, కిచప్ తో తింటే చాలా రుచిగా ఉంటుంది.. వీటిని పిల్లలు పెద్దలు అందరు ఇష్టంగా తింటారు.. పిల్లలకు హెల్త్ కు చాలా మంచిది.. ఇలా చేస్తే చాలా ఇష్టంగా తింటారు.. చూసారుగా ఎంతో సింపుల్ గా తయారు చేసుకోవచ్చునో .. ఒక్కసారి ట్రై చెయ్యండి..