స్త్రీ అయినా, పురుషుడైనా అందరూ అందంగా కనిపించడం కోసం తమ ముఖానికి ఏదో ఒకటి రాసుకుంటూ ఉంటారు. కొంతమంది తమ ముఖాన్ని మచ్చలు లేకుండా, అందంగా మార్చుకోవడానికి రకరకాల క్రీమ్స్ పూస్తుంటారు. చాలా మంది తమ ముఖానికి వేప, తేనెను వాడతారు. ఇది వారికి చాలా ప్రయోజనం చేకూరుస్తుంది. వేప, తేనెలో అనేక లక్షణాలు ఉన్నాయి. ఇవి చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే దీన్ని సరిగ్గా ఎలా వినియోగించాలో చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు.
యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ ఆక్సిడెంట్ తదితర లక్షణాలు వేపలో ఉంటాయని తెలిసిందే.. తేనెలో కూడా యాంటీ బాక్టీరియల్, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. ఇవి శరీరంలోని రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంతో పాటు, అనేక వ్యాధులతో పోరాడడంలో సహాయకరంగా ఉంటుంది. అంతేకాకుండా.. ముఖంలో మెరుపు పెరుగుతుంది. ఉదయాన్నే తేనె, వేప తింటే దాని ప్రభావం మీ ముఖంపై స్పష్టంగా కనిపిస్తుంది. వేప, తేనెను పేస్ట్ చేసి ఖాళీ కడుపుతో తినాలి. వేప, తేనె పేస్ట్‌ని సులభంగా ఎలా తయారు చేయవచ్చో తెలుసుకుందాం..
Hassan Nasrallah: అంత్యక్రియలు జరిగే వరకు రహస్య ప్రదేశంలో నస్రల్లా తాత్కాలిక ఖననం..
కావలసినవి:
వేప ఆకులు
తేనె
నీరు
ముందుగా ఈ పేస్ట్‌ను తయారు చేసేందుకు వేప ఆకును తీసుకుని నీళ్లతో శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత ఆకులను మిక్సీలో వేసి పేస్ట్‌లా చేసుకోవాలి. అందులో తేనె వేసి ఒక చెంచాతో కలపండి. ఈ పేస్ట్‌ను ఉదయం పూట తీసుకోవాలి.. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడమే కాకుండా మీ ముఖంపై మెరుపును కూడా తెస్తుంది. ఈ పేస్ట్‌ను ముఖానికి కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే దీన్ని ముఖానికి అప్లై చేసే ముందు ముఖాన్ని శుభ్రమైన నీటితో శుభ్రం చేసుకోవాలి. వేప, తేనెను రోజూ వాడటం వల్ల ముఖంపై మొటిమలు రాకుండా ఉంటాయి. అంతేకాకుండా.. దురద నుండి కూడా ఉపశమనాన్ని అందిస్తుంది. నల్లటి మొటిమలు కూడా తొలగిపోతాయి. దీన్ని ఉపయోగించడం వల్ల ముఖంపై వచ్చే మొటిమలు కూడా తొలగిపోతాయి. వేప, తేనె ముఖ సౌందర్యాన్ని పెంచుతాయి.