Hyderabadi Chicken Dum Biryani Recipe హైదరాబాద్ అంటే ఠక్కున గుర్తొచ్చేది బిర్యానీ. హైదరాబాద్ బిర్యానీకి ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ ఉంది. ఇతర రాష్ట్రాలు, దేశాలకు చెందిన నాన్‌వెజ్ ప్రియులు హైదరాబాద్ వస్తే బిర్యానీ రుచి చూడకుండా ఉండలేరంటే అతిశయోక్తి కాదు. అంతటి ఆదరణ కలిగిన హైదరాబాద్ ఇప్పటికే ఎంతో ప్రాచుర్యం పొందింది. ఈ హైదరాబాద్ దమ్ బిర్యానీని రెస్టారెంట్ రేంజ్లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి..
READ MORE: Anirudh: ఇదేంట్రా అయ్యా.. చాట్ జీపీటీతో అనిరుధ్ మ్యూజిక్?
కావాల్సిన పదార్థాలు..
చికెన్ – కిలో, కేజీ బాస్మతి రైస్, మరాఠి మొగ్గ, బిర్యానీ ఆకు, షాజీరా, నిమ్మరసం, వేయించిన ఉల్లిపాయ ముక్కలు- కప్పు, పచ్చిమిరపకాయలు- 8, లవంగాలు-8
దాల్చిన చెక్క-4, యాలకులు-7, జాపత్రి, జాజికాయ, అల్లంవెల్లుల్లి ముద్ద, జీలకర్ర, ధనియాల పొడి, ఉప్పు- తగినంత, పెరుగు- రెండు కప్పులు,
కొత్తిమీర, పుదీనా- కప్పు చొప్పున, పాలు- కొన్ని, కుంకుమపువ్వు, ఫుడ్ కలర్ (కావాలనుకుంటే), నూనె- తగినంత.
READ MORE: Brazil: శరీరానికి అంటి పెట్టుకున్న 26 ఐఫోన్లు, ప్రయాణంలో యువతి మృతి.. అసలేమీ ఏం జరిగింది?
మొదట స్టవ్ వెలిగించి దాని మీద ఓ గిన్నె పెట్టుకోండి. దాంట్లో కప్పు బియ్యానికి నాలుగు కప్పుల చొప్పున నీళ్లు పోయండి. ఆ నీటిలో కొంచె ఉప్పు వేసి బాగా మరిగించండి. ఇందులో షాజీరా, దాల్చిన చెక్క, జాజికాయ, బిర్యానీ ఆకు, లవంగాలు వేసి లైట్‌గా నూనె పోయండి. నీళ్లు బాగా మరుతున్నప్పుడు బియ్యం వేసేయండి. ఈ మిశ్రమాన్ని ఒక సారి కలపండి. మూడొంతులు ఉడికిన తర్వాత మంటను చిన్నగా చేయండి. చిల్లుల గరిటెతో అన్నాన్ని తీస్తూ చికెన్ మిశ్రమంలో పొరలా వేసుకోండి. ఇలా సగం అన్నం వేయాలి. దీనిపై వేయించిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పుదీనా తరుగు, నిమ్మరసం వేసుకోండి. కాస్త గులాబీ నీళ్లు కూడా పోసుకోండి. మిగిలిన రైస్ పొరలా వేసుకోండి.చివరగా పుదీనా, వేయించిన ఉల్లిపాయ ముక్కలు, కుంకుమపువ్వు పాలు లేదా ఫుడ్ కలర్, నెయ్యి వేసుకోండి. మూత పెట్టి.. ఆవిరి బయటకు వెళ్లనివ్వకుండా.. అంచులను గోధుమపిండితో పూర్తిగా మూసి, ఏదైనా బరువును పెట్టాలి. మొదట పది నిమిషాలు మంట పెద్దగా, ఆ తర్వాత మరో పదినిమిషాలు మధ్యస్థంగా, మరో పది నిమిషాలు చివరికి సిమ్‌లో పెట్టుకోండి. ఆ తర్వాత స్టౌ ఆప్ చేయండి. అంతే టేస్టీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ. ఇంటిళ్లిపాది కడుపునిండా తినండి..!