BSF Tradesman Recruitment: భారత సరిహద్దు భద్రతా దళం (BSF) 2025 సంవత్సరానికి గాను ట్రేడ్స్‌మన్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి 3588 ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో పురుషులకు 3406 పోస్టులు, మహిళలకు 182 పోస్టులు కేటాయించబడ్డాయి. ఈ నియామక ప్రక్రియకు సంబంధించి పూర్తి సమాచారాన్ని అధికారిక వెబ్‌సైట్ అయిన https://rectt.bsf.gov.in ద్వారా పొందవచ్చు. జూలై 26, 2025 నుండి ఆగస్టు 25, 2025 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకవేళ దరఖాస్తులో ఏవైనా తప్పులు చేసి ఉంటె వారికోసం సవరణలు చేయడానికి ఆగస్టు 24 నుండి 26వ తేదీ వరకు అవకాశం ఉంది.
ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియ కింద నియమించబడే కానిస్టేబుల్ (ట్రేడ్స్‌మన్) పోస్టులకు జీతాలు రూ. 21,709 నుండి రూ. 69,100 వరకు ఉంది. ఈ ఉద్యోగాలకు అర్హతల విషయానికొస్తే.. అభ్యర్థులు కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. కుక్, వాటర్ క్యారియర్, వేటర్ వంటి ట్రేడ్స్ కోసం ఫుడ్ ప్రొడక్షన్ లేదా కిచెన్ కోర్సు (NSDC లేదా గుర్తింపు పొందిన సంస్థ నుండి) ఉండాలి.
Green fuel: భూగర్భంలో భారీగా “గ్రీన్ ఇంధన” నిల్వలు.. 1.70 లక్షల ఏళ్లకు సరిపోయే అద్భుత నిధి..
కార్పెంటర్, పెయింటర్, ఎలక్ట్రిషియన్ వంటి పోస్టులకు 2 సంవత్సరాల ITI లేదా 1 సంవత్సరం కోర్సు + 1 సంవత్సరం అనుభవం అవసరం. వడ్రంగి, టైలర్, వాషర్‌మన్, బార్బర్ వంటి ట్రేడ్స్‌కి సంబంధిత నైపుణ్యం ఉండాలి. ట్రేడ్ టెస్ట్ ఉత్తీర్ణత తప్పనిసరి. వయస్సు పరిమితి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. అయితే SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానంలో నాలుగు దశలు ఉంటాయి. ఇందులో మొదటగా శారీరక ప్రమాణాల పరీక్ష (PST), శారీరక సామర్థ్య పరీక్ష (PET) జరుగుతుంది. కొన్నిసార్లు ట్రేడ్ టెస్ట్ కూడా ఈ దశలో నిర్వహిస్తారు. తరువాత దశగా ఆబ్జెక్టివ్ రాత పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు డాక్యుమెంట్ వెరిఫికేషన్, అవసరమైతే ట్రేడ్ టెస్ట్‌కు పిలవబడతారు. చివరి దశగా పూర్తి శరీర పరీక్ష (మెడికల్ ఎగ్జామినేషన్) జరుగుతుంది.
Nava Nandulu: చుట్టూ ప్రకృతి మాధుర్యం, పవిత్ర శైవ క్షేత్రాలైన ‘నవనందుల’ గురించి తెలుసా?
PSTలో పురుషుల కోసం ఎత్తు, ఛాతీ ప్రమాణాలు ఉండేలా చూసుకుంటారు. మహిళలకు కేవలం ఎత్తు ప్రమాణాలనే పరిగణనలోకి తీసుకుంటారు. దరఖాస్తు ఫీజు విషయానికొస్తే.. జనరల్/OBC/EWS అభ్యర్థులకూ రూ.150 + 18% GST వర్తిస్తుంది. SC/ST, మహిళలు, BSF సిబ్బంది, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది. ఫీజు చెల్లింపును UPI, డెబిట్/క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ లేదా CSC సెంటర్ ద్వారా చేయవచ్చు.
ఆసక్తి గల అభ్యర్థులు https://rectt.bsf.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి “BSF Tradesman Recruitment 2025” లింక్‌పై క్లిక్ చేసి, కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకుని లేదా లాగిన్ చేసి వివరాలు జాగ్రత్తగా పూర్తి చేయాలి. అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేసి, ఫీజు చెల్లించాక దరఖాస్తును సడ్మిట్ చేయాలి. చివరగా దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవాలి. అభ్యర్థులు తమ స్వంత రాష్ట్రానికి కేటాయించబడిన ఖాళీలకే దరఖాస్తు చేయవలసి ఉంటుంది.