Brazil: శరీరానికి అంటి పెట్టుకున్న 26 ఐఫోన్లు, ప్రయాణంలో యువతి మృతి.. అసలేమీ ఏం జరిగింది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Brazil: బ్రెజిల్ లోని పరానా ప్రాంతంలో ఒక బస్సులో 20 ఏళ్ల యువతి మృతదేహంగా కనుగొనబడడం స్థానికంగా సంచలనంగా మారింది. ఈ ఘటన గారాపువావా అనే ప్రాంతంలో జరిగినట్టు అధికారులు తెలిపారు. అయితే మృతి చెందిన యువతికి శరీరానికి 26 ఐఫోన్లు అంటించి ఉండటాన్ని అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఈ ఘటనపై అక్కడి సివిల్ పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతున్నారు.
Mrunal Thakur: డెకాయిట్ కోసం మృణాల్ ఎదురుచూపులు!
Also Read
- Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
- Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?
- Tragedy: ఘోర ప్రమాదం.. నిర్మాణంలో ఉన్న చర్చి పైకప్పు కూలి ముగ్గురు మృతి, 11 మందికి గాయాలు
- Kanchipuram Horror: రూ.20 వేల అప్పు కోసం బాలింత నిర్బంధం.. గుడారంలోనే ప్రసవం, తల్లీబిడ్డ మృతి
ఇకపోతే, బస్సు ప్రయాణంలో ఆమె అకస్మాత్తుగా అస్వస్థతకు గురై గాలితీసుకోవడంలో ఇబ్బందిపడుతున్నట్టు ప్రవర్తించిందని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. ఆమెకు ఒక్కసారిగా భయానక లక్షణాలు కనిపించడంతో అత్యవసర సేవల బృందాన్ని పిలిపించారు. బస్సులోనే ప్రాథమిక చికిత్స ఇచ్చినా, ఆమెకు గుండెపోటు రావడంతో పరిస్థితి విషమించింది. సుమారు 45 నిమిషాల పాటు ప్రాణాలు కాపాడడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ వైద్య బృందం ఆమెను కాపాడలేక పోయింది.
ఇక పోలీసుల వివరాల ప్రకారం, ఆమె శరీరానికి నేరుగా అంటించిన 26 ఐఫోన్లు ఉన్నట్టు వారు గుర్తించారు. ఈ నేపథ్యంలో సైంటిఫిక్ పోలీస్, సివిల్ పోలీస్ ఫోరెన్సిక్ బృందాలు సంఘటన స్థలానికి విచారణకు వచ్చాయి. స్నిఫర్ డాగ్‌ను కూడా వాడి మాదకద్రవ్యాల కోసం తనిఖీ చేసినా ఎటువంటి మాదక పదార్థాల జాడ కనిపించలేదు. అయితే, ఆమె లగేజ్ లో పలు మద్యం సీసాలు ఉన్నట్లు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. యువతీ మృతి కారణాన్ని పూర్తిగా స్పష్టంగా తేల్చేందుకు ఫోరెన్సిక్ నివేదిక కోసం వేచి చూస్తున్నట్టు తెలిపారు. ఐఫోన్లన్నింటిని బ్రెజిల్ ఫెడరల్ రెవెన్యూ సర్వీస్‌కు అప్పగించారు. ప్రస్తుతం ఈ ఘటనకు స్మగ్లింగ్ సంబంధముందా అనే కోణంలోనూ దర్యాప్తు జరుగుతోంది.
Jovem de 20 anos morre após parada cardiorrespiratória em ônibus no Paraná. Ela carregava 26 iPhones colados ao corpo. Polícia investiga o caso; celulares foram apreendidos e levados à Receita Federal. Causa da morte será periciada. (Imagem gerada sobre foto divulgada na WEB) pic.twitter.com/6AzebBFf95
— NO RADAR RIBEIRÃO (@LucinhoMendes) July 31, 2025
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!