Food Tips : పురుగులు పట్టకుండా పిండి 6 నెలలు ఫ్రెష్‌గా ఉండాలంటే… ఈ ట్రిక్ మిస్ చేయకు.!
- పిండికి పురుగులు పడటానికి అసలు కారణం ఏమిటి?
- ఎండలో ఆరబెట్టడం ద్వారా తేమను తొలగించే చిట్కా
- బిర్యానీ ఆకులు, లవంగాలతో పురుగులు దూరం
- ఎయిర్‌టైట్ డబ్బాలతో పిండి ఎక్కువకాలం ఫ్రెష్‌గా ఉంచడం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మన వంటగదిలో బియ్యం, గోధుమ పిండి ఎప్పుడూ ఉంటాయి కదా.. చపాతీలు, రొట్టెలు, పూరీలు రోజూ ఉపయోగిస్తాం. కానీ ఒక్కసారి పిండికి పురుగులు పడితే సమస్యే.. తెల్లటి చిన్న పురుగులు (వీవిల్స్ అంటారు) కనిపిస్తాయి, పిండి వాసన వస్తుంది, పాడైపోతుంది. పురుగు పట్టిన పిండితో చేసిన రొట్టెలు తినడానికి కూడా మనసు రాదు. ఈ సమస్య ఎందుకు వస్తుంది, దీన్ని ఎలా అరికట్టాలో చూద్దాం.
పిండిలో పురుగులు రావడానికి ప్రధాన కారణం ఏంటి?
పిండికి పురుగులు పడటానికి అతి పెద్ద కారణం తేమ. వాతావరణం మారినప్పుడు – ముఖ్యంగా చలికాలం నుంచి వేసవికి, లేదా వర్షాకాలంలో – గాలిలో తేమ ఎక్కువవుతుంది. ఈ తేమ వల్ల పురుగులు, వాటి గుడ్లు సులభంగా పెరిగిపోతాయి. చల్లదనం కోసం పురుగులు పిండి వైపు ఆకర్షితమవుతాయి. ఇలాంటి సమయాల్లో పిండి త్వరగా పురుగు పట్టే అవకాశం ఎక్కువ.
Also Read
- Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
- Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
- Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
- Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
Best Kitchen Hacks : కూర మాడిపోయిందా..? కంగారు పడకండి.. ఈ చిన్న చిట్కాలతో మాడిన వాసన మాయం.!
పురుగుల్ని తొలగించడానికి సులభమైన సహజ మార్గాలు
ముందుగా తేమను తొలగించడం చాలా ముఖ్యం. వారానికి ఒకసారి పిండిని వెడల్పాటి పాత్రలో పలుచగా పరచి, 2-3 గంటలు ఎండలో పెట్టండి. సూర్యరశ్మి తేమను పూర్తిగా ఆరబెడుతుంది, పురుగులు బయటకు పారిపోతాయి లేదా చనిపోతాయి. పురుగులు కనిపించగానే
వెంటనే ఈ పద్ధతి ట్రై చేయండి – చాలా ఎఫెక్టివ్!
పురుగులు, వాటి గుడ్లు పూర్తిగా తొలగాలంటే సన్నని రంధ్రాల జల్లెడతో పిండిని జల్లండి. ఇది కొంచెం టైమ్ తీసుకుంటుంది కానీ పిండి శుభ్రంగా వస్తుంది. పిండిని నిల్వ చేసే డబ్బాలో కొన్ని బిర్యానీ ఆకులు (తెజ్ పత్తా) లేదా 2-3 ఎండు మిరపకాయలు వేయండి. వాటి ఘాటు వాసనకు పురుగులు దూరంగా ఉంటాయి. అలాగే, పిండిని ఎయిర్‌టైట్ కవర్‌లో పెట్టి 4-5 గంటలు ఫ్రిజ్‌లో ఉంచితే చల్లదనానికి పురుగులు, గుడ్లు చనిపోతాయి.
IND vs NZ Final: భారత్-న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ రద్దయితే విజేత ఎవరు? ఐసీసీ రూల్స్ ఏం చెబుతున్నాయంటే!
పురుగులు మళ్లీ రాకుండా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి
పిండి డబ్బాలో 8-10 లవంగాల్ని అక్కడక్కడ వేయండి. లవంగంలో ఉండే యాంటీ-బాక్టీరియల్ గుణాలు పురుగుల్ని దూరంగా ఉంచుతాయి. బాగా ఎండిన వేపాకుల్ని చిన్న గుడ్డలో కట్టి పిండి మధ్యలో పెట్టండి.. పురుగులు అస్సలు రావు.. కొంచెం కల్లు ఉప్పును చిన్న గుడ్డలో కట్టి డబ్బాలో పెట్టండి. ఇది తేమను పీల్చుకుంటుంది, పురుగులు పట్టే అవకాశం తగ్గుతుంది. పొట్టు తీయని వెల్లుల్లి రెబ్బల్ని 4-5 పిండిలో వేస్తే దాని వాసన కూడా పురుగులకు నచ్చదు.
ఇకపై పురుగులు రాకుండా జాగ్రత్తలు
పిండిని ఎప్పుడూ గాలి రాకుండా మూసే ఎయిర్‌టైట్ డబ్బాల్లోనే నిల్వ చేయండి. ఒకేసారి చాలా ఎక్కువ మొత్తంలో పిండి కొనకండి – తక్కువగా తీసుకొని త్వరగా ఉపయోగించండి. పాత పిండి ఎక్కువ కాలం ఉంచకండి, ఎందుకంటే పాతది త్వరగా పురుగు పట్టే అవకాశం ఉంటుంది. కొనేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది.
తాజావార్తలు
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!