NTV Telugu Site icon

Dengue Fever: తెలంగాణలో డెంగ్యూ విజృంభణ.. ఈ వ్యాధి రాకుండా ఉండాలంటే ఈ టిప్స్ పాటించండి

Dengue

Dengue

తెలంగాణ రాష్ట్రంలో డెంగీ పంజా విసురుతోంది. ప్రస్తుతం 5,500పైగా డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. అనేక జిల్లాల్లో 100కు పైగా కేసులు నమోదు అవగా.. ఇక, హైదరాబాద్ లో 2148, కరీంనగర్ 224, ఖమ్మం 641, మహబూబాబాద్ 103, మహబూబ్ నగర్ 120, మేడ్చల్ మల్కాజ్ గిరి 356, నల్గొండ 151, పెద్దపల్లి 155, రంగారెడ్డి 100, సంగారెడ్డి 132, సూర్యాపేట 222, వరంగల్ లో 208 కేసులు నమోదు అయినట్లు వైద్యులు తెలిపారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గంగాదేవిపాడు గ్రామంలో ఈడుపుగంటి సామ్రాజ్యం (67) అనే మహిళకు వారం కింద జ్వరం రావడంతో ఆస్పత్రిలో చేరారు. అక్కడి చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. అటు, ఇదే మండలం బ్రహ్మళకుంటకు చెందిన బానోతు కృష్ణ (50)కు వారం కింద ప్లేట్‌లెట్స్ పడిపోవడంతో కల్లూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందాడు. రెండు రోజుల కిందటే ఇంటికి వచ్చి పొలం వద్దకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. అలాగే, కామారెడ్డి – సదాశివనగర్ మండలంలోని భూంపల్లికి చెందిన మనస్విని (11)కి జ్వరం రాగా కుటుంబ సభ్యులు కామారెడ్డి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ తరలించాలని వైద్యులు సూచించారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ తీసుకొస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయింది. ఇలా ఇప్పటి వరకు పలు జిల్లాల్లో చాలా మంది ప్రాణాలు కొల్పోయారు.

READ MORE: Sri Krishna Art: వావ్.. కృష్ణయ్యని పెన్సిల్ మొనపై భలే చేసాడుగా..

డెంగ్యూ వ్యాధి ఎలా సోకుతుంది..?


డెంగ్యూ అనేది భారతదేశంలో ప్రజారోగ్యాన్ని ప్రభావితం చేసే వైరల్ వ్యాధి. ముఖ్యంగా వర్షాకాలంలో ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడుతుంటారు. దోమల కాటు ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ఈ వ్యాధి ఇన్ఫెక్షన్, డెంగ్యూ జ్వరం (DF), డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్/డెంగ్యూ షాక్ సిండ్రోమ్ (DHF/DSS) మొదలైన అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది. డెంగ్యూ చికిత్స కోసం లైసెన్స్ పొందిన వ్యాక్సిన్ లేదా నిర్దిష్ట యాంటీవైరల్ థెరపీ అందుబాటులో లేదు. కానీ సప్లిమెంట్ మందులు ప్రయోజనకరంగా ఉంటాయి. వ్యాధిని ముందుగా గుర్తించడం డెంగ్యూ చికిత్సకు సహాయపడుతుంది. కాబట్టి, డెంగ్యూ వ్యాధి సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఇప్పుడు చూద్దాం. ఈ వైరస్​ను దోమలు వ్యాపింపచేస్తాయి. ఏడెస్ జాతికి చెందిన దోమలు మురికి నీటిలో సంతానోత్పత్తి చేసి.. డెంగ్యూను వ్యాప్తి చేస్తాయి. అయితే వీటి వృద్ధిని అడ్డుకోవాలంటే కొన్ని చిట్కాలను పాటించాలి. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. దోమల నివారణకు వలలు, పురుగులు మందులతో పిచికారీలు, దోమల నివారణ మందులు ఉపయోగించడం వల్ల డెంగ్యూరాకుండా జాగ్రత్త పడవచ్చు.

READ MORE:Monkeypox: మంకీపాక్స్కు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డు

దోమల ప్యాచ్‌లు..

మార్కెట్‌లో దోమలు కుట్టకుండా అనేక క్రీములు అందుబాటులో ఉన్నాయి. కానీ.. వీటిని రోజుకు మూడు సార్లు కంటే ఎక్కువ వాడకూడదని నిపుణులు సూచిస్తున్నారు. క్రీమ్‌లు కాకుండా.. మీరు మీ దుస్తులకు వెనుక భాగంలో దోమల ప్యాచ్‌లను అతికించవచ్చు. అవి మూడు రోజుల వరకు ఉంటాయి. రిపెల్లెంట్ బ్యాండ్‌లు, దోమల తొడుగులు కూడా చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. ముఖ్యంగా పిల్లలకు బాగా ఉపయోగపడతాయి.

పరిసరాల పరిశుభ్రత ముఖ్యం..

దోమల నివారణ పరిష్కారాలలో ముఖ్యమైనది పరిసరాలు పరిశుభ్రత. రోజూ ఇంటిని శుభ్రపరచడం అవసరం. అంతే కాకుండా పరిసరాలను శుభ్రం చేయడానికి ఉపయోగించే నీటిలో నిమ్మగడ్డి లేదా సిట్రోనెల్లా చుక్కను వేయాలి. కొన్ని ఎలక్ట్రానిక్ దోమల నిరోధకాలు కూడా ఉన్నాయి. వాటి ఆవిరి దోమలను దూరంగా ఉంచుతుంది. నారింజ, నిమ్మకాయలలో లవంగాలు పెట్టడం వల్ల కూడా ఈగలు, దోమలు దరిదాపులకు రావు.

READ MORE:Xiaomi X Pro QLED: ‘షావోమీ’ నుంచి సూపర్ స్మార్ట్‌టీవీ.. ధర చాలా తక్కువ!

నీటి నిల్వలు లేకుండా చూడాలి..

డెంగ్యూ వ్యాప్తి చేసే దోమలు ఎక్కువగా.. మురినీరు, తడిగా ఉన్న ప్రదేశాలలో ఉంటాయి. మీ చుట్టుపక్కల నీరు నిలువకుండా శుభ్రం చేయడం చాలా అవసరం. అంతే కాకుండా.. స్విమ్మింగ్ ఫుల్, కూలర్‌లో నీరు ఎక్కువ కాలం నిలువ ఉండకుండా జాగ్రత్త పడాలి. వాటిని ఎప్పటి కప్పుడు క్లీన్ చేస్తుండాలి. చేపలు పెంచే వారు మీ అక్వేరియంలో నీటిని తరచూ మారుస్తూ ఉండండి. పూల కుండీల నీటిని క్రమం తప్పకుండా మార్చండి. పాత్రలు, నేలను కడగకుండా అపరిశుభ్రంగా ఉంచవద్దు.

శరీర భాగాలకు రక్షణ కవచం..

ప్రస్తుతం దోమలు ఎక్కవగా తిరుగుతున్న తరుణంలో దుస్తులు పొట్టిగా కాకుండా శరీరం మొత్తం కప్పేలా ధరించడం మంచిది. పూర్తి ప్యాంటు, పొడవాటి చేతులు కలిగిన చొక్కాలతో శరీరాన్ని కవర్ చేసుకోవడం అవసరం. లేత రంగు దుస్తులను ధరించడండి. రాత్రి పూట నింద్రించేటప్పుడు దోమతెరలు వాడటం మంచిది.