Dengue Fever: తెలంగాణలో డెంగ్యూ విజృంభణ.. ఈ వ్యాధి రాకుండా ఉండాలంటే ఈ టిప్స్ పాటించండి
- తెలంగాణ రాష్ట్రంలో డెంగీ పంజా విసురుతోంది
- . ప్రస్తుతం 5 500పైగా డెంగ్యూ కేసులు
- పలు జిల్లాల్లో మరణాలు
- అనేక జిల్లాల్లో 100కు పైగా కేసులు
- ఈ నివారణ సుత్రాలు పాటించండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రంలో డెంగీ పంజా విసురుతోంది. ప్రస్తుతం 5,500పైగా డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. అనేక జిల్లాల్లో 100కు పైగా కేసులు నమోదు అవగా.. ఇక, హైదరాబాద్ లో 2148, కరీంనగర్ 224, ఖమ్మం 641, మహబూబాబాద్ 103, మహబూబ్ నగర్ 120, మేడ్చల్ మల్కాజ్ గిరి 356, నల్గొండ 151, పెద్దపల్లి 155, రంగారెడ్డి 100, సంగారెడ్డి 132, సూర్యాపేట 222, వరంగల్ లో 208 కేసులు నమోదు అయినట్లు వైద్యులు తెలిపారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గంగాదేవిపాడు గ్రామంలో ఈడుపుగంటి సామ్రాజ్యం (67) అనే మహిళకు వారం కింద జ్వరం రావడంతో ఆస్పత్రిలో చేరారు. అక్కడి చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. అటు, ఇదే మండలం బ్రహ్మళకుంటకు చెందిన బానోతు కృష్ణ (50)కు వారం కింద ప్లేట్‌లెట్స్ పడిపోవడంతో కల్లూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందాడు. రెండు రోజుల కిందటే ఇంటికి వచ్చి పొలం వద్దకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. అలాగే, కామారెడ్డి – సదాశివనగర్ మండలంలోని భూంపల్లికి చెందిన మనస్విని (11)కి జ్వరం రాగా కుటుంబ సభ్యులు కామారెడ్డి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ తరలించాలని వైద్యులు సూచించారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ తీసుకొస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయింది. ఇలా ఇప్పటి వరకు పలు జిల్లాల్లో చాలా మంది ప్రాణాలు కొల్పోయారు.
READ MORE: Sri Krishna Art: వావ్.. కృష్ణయ్యని పెన్సిల్ మొనపై భలే చేసాడుగా..
Also Read
- Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
- Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
- Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
- Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
డెంగ్యూ వ్యాధి ఎలా సోకుతుంది..?
డెంగ్యూ అనేది భారతదేశంలో ప్రజారోగ్యాన్ని ప్రభావితం చేసే వైరల్ వ్యాధి. ముఖ్యంగా వర్షాకాలంలో ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడుతుంటారు. దోమల కాటు ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ఈ వ్యాధి ఇన్ఫెక్షన్, డెంగ్యూ జ్వరం (DF), డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్/డెంగ్యూ షాక్ సిండ్రోమ్ (DHF/DSS) మొదలైన అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది. డెంగ్యూ చికిత్స కోసం లైసెన్స్ పొందిన వ్యాక్సిన్ లేదా నిర్దిష్ట యాంటీవైరల్ థెరపీ అందుబాటులో లేదు. కానీ సప్లిమెంట్ మందులు ప్రయోజనకరంగా ఉంటాయి. వ్యాధిని ముందుగా గుర్తించడం డెంగ్యూ చికిత్సకు సహాయపడుతుంది. కాబట్టి, డెంగ్యూ వ్యాధి సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఇప్పుడు చూద్దాం. ఈ వైరస్‌ను దోమలు వ్యాపింపచేస్తాయి. ఏడెస్ జాతికి చెందిన దోమలు మురికి నీటిలో సంతానోత్పత్తి చేసి.. డెంగ్యూను వ్యాప్తి చేస్తాయి. అయితే వీటి వృద్ధిని అడ్డుకోవాలంటే కొన్ని చిట్కాలను పాటించాలి. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. దోమల నివారణకు వలలు, పురుగులు మందులతో పిచికారీలు, దోమల నివారణ మందులు ఉపయోగించడం వల్ల డెంగ్యూరాకుండా జాగ్రత్త పడవచ్చు.
READ MORE:Monkeypox: మంకీపాక్స్కు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డు
దోమల ప్యాచ్‌లు..
మార్కెట్‌లో దోమలు కుట్టకుండా అనేక క్రీములు అందుబాటులో ఉన్నాయి. కానీ.. వీటిని రోజుకు మూడు సార్లు కంటే ఎక్కువ వాడకూడదని నిపుణులు సూచిస్తున్నారు. క్రీమ్‌లు కాకుండా.. మీరు మీ దుస్తులకు వెనుక భాగంలో దోమల ప్యాచ్‌లను అతికించవచ్చు. అవి మూడు రోజుల వరకు ఉంటాయి. రిపెల్లెంట్ బ్యాండ్‌లు, దోమల తొడుగులు కూడా చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. ముఖ్యంగా పిల్లలకు బాగా ఉపయోగపడతాయి.
పరిసరాల పరిశుభ్రత ముఖ్యం..
దోమల నివారణ పరిష్కారాలలో ముఖ్యమైనది పరిసరాలు పరిశుభ్రత. రోజూ ఇంటిని శుభ్రపరచడం అవసరం. అంతే కాకుండా పరిసరాలను శుభ్రం చేయడానికి ఉపయోగించే నీటిలో నిమ్మగడ్డి లేదా సిట్రోనెల్లా చుక్కను వేయాలి. కొన్ని ఎలక్ట్రానిక్ దోమల నిరోధకాలు కూడా ఉన్నాయి. వాటి ఆవిరి దోమలను దూరంగా ఉంచుతుంది. నారింజ, నిమ్మకాయలలో లవంగాలు పెట్టడం వల్ల కూడా ఈగలు, దోమలు దరిదాపులకు రావు.
READ MORE:Xiaomi X Pro QLED: ‘షావోమీ’ నుంచి సూపర్ స్మార్ట్‌టీవీ.. ధర చాలా తక్కువ!
నీటి నిల్వలు లేకుండా చూడాలి..
డెంగ్యూ వ్యాప్తి చేసే దోమలు ఎక్కువగా.. మురినీరు, తడిగా ఉన్న ప్రదేశాలలో ఉంటాయి. మీ చుట్టుపక్కల నీరు నిలువకుండా శుభ్రం చేయడం చాలా అవసరం. అంతే కాకుండా.. స్విమ్మింగ్ ఫుల్, కూలర్‌లో నీరు ఎక్కువ కాలం నిలువ ఉండకుండా జాగ్రత్త పడాలి. వాటిని ఎప్పటి కప్పుడు క్లీన్ చేస్తుండాలి. చేపలు పెంచే వారు మీ అక్వేరియంలో నీటిని తరచూ మారుస్తూ ఉండండి. పూల కుండీల నీటిని క్రమం తప్పకుండా మార్చండి. పాత్రలు, నేలను కడగకుండా అపరిశుభ్రంగా ఉంచవద్దు.
శరీర భాగాలకు రక్షణ కవచం..
ప్రస్తుతం దోమలు ఎక్కవగా తిరుగుతున్న తరుణంలో దుస్తులు పొట్టిగా కాకుండా శరీరం మొత్తం కప్పేలా ధరించడం మంచిది. పూర్తి ప్యాంటు, పొడవాటి చేతులు కలిగిన చొక్కాలతో శరీరాన్ని కవర్ చేసుకోవడం అవసరం. లేత రంగు దుస్తులను ధరించడండి. రాత్రి పూట నింద్రించేటప్పుడు దోమతెరలు వాడటం మంచిది.
తాజావార్తలు
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
-
CJP Protest: “మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు”.. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
ట్రెండింగ్
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!