Honey Tea Benefits in Telugu : మన దైనందిన జీవితంలో టీ అనేది ఒక విడదీయలేని భాగం. అయితే, ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ చాలామంది చక్కెర (Sugar)కు ప్రత్యామ్నాయంగా తేనెను ఎంచుకుంటున్నారు. ఆయుర్వేదంలో తేనెకు ‘మధు’ అని పేరు, దీనిని సర్వరోగ నివారిణిగా పరిగణిస్తారు. తేనెలో సహజమైన గ్లూకోజ్, ఫ్రక్టోజ్‌లతో పాటు విటమిన్ బి, కాల్షియం, మెగ్నీషియం వంటి కీలక ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అయితే, టీలో తేనెను కలిపేటప్పుడు మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల దానిలోని అసలైన ఔషధ గుణాలు నశించే అవకాశం ఉంది. సరైన ఉష్ణోగ్రత వద్ద, సరైన సమయంలో తేనెను టీలో కలిపినప్పుడే అది శరీరానికి పూర్తిస్థాయిలో యాంటీ ఆక్సిడెంట్లను, యాంటీ బ్యాక్టీరియల్ ప్రయోజనాలను అందిస్తుంది. టీని కేవలం ఒక పానీయంగానే కాకుండా, ఒక ఔషధంగా మార్చుకోవడానికి పాటించాల్సిన చిట్కాలు ఇక్కడ ఉన్నాయి.
Live in Relationship: సహజీవనం చేస్తున్న జంటలకు గుడ్‌న్యూస్.. కేంద్రం కీలక నిర్ణయం
శాస్త్రీయ కారణం: టీ మరుగుతున్నప్పుడు లేదా పొగలు గక్కుతున్నంత వేడిగా ఉన్నప్పుడు తేనెను అస్సలు కలపకూడదు. తేనెను అధిక ఉష్ణోగ్రత వద్ద వేడి చేస్తే అందులోని ఎంజైములు, పోషకాలు దెబ్బతింటాయి. ఒక్కోసారి అది విషతుల్యంగా మారే ప్రమాదం కూడా ఉందని ఆయుర్వేద నిపుణులు హెచ్చరిస్తుంటారు.
సరైన సమయం: టీని వడకట్టుకున్న తర్వాత, దాని వేడి కొంచెం తగ్గి గోరువెచ్చగా (Luke warm) ఉన్నప్పుడు మాత్రమే తేనెను కలపాలి. ఇలా చేయడం వల్ల తేనెలోని పోషకాలు నేరుగా మన శరీరానికి అందుతాయి.
తేనె టీ చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ ఎంతో మేలు చేస్తుంది. అయితే గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ తేనెను ఉడికించకూడదు లేదా మరుగుతున్న నీటిలో వేయకూడదు.