Trump-Jinping: ట్రంప్ విందుకు అందరూ వచ్చారు.. అసలైనోడే డుమ్మా కొట్టాడు.. ఎవరా ముఖ్యుడు!
- జిన్‌పింగ్ కోసం ట్రంప్ ప్రత్యేక విందు
- విందుకు హాజరైన టెక్ దిగ్గజాలు
- అసలైన ఏఐ బాస్ మిస్సింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ గౌరవార్థం వైట్‌హౌస్‌లో ట్రంప్ ప్రత్యేక విందు ఇచ్చారు. స్టేట్ డిన్నర్‌కు టెక్ దిగ్గజాలను ఆహ్వానించారు. ఇక జిన్‌పింగ్ పర్యటనలో ప్రాముఖ్యంగా ఏఐ, వాణిజ్యమే ప్రధాన అజెండాగా ఉన్నాయి. ఇక ఈ విందుకు ప్రముఖ టెక్ దిగ్గజాలైన ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్, యాపిల్ సీఈఓ టిమ్ కుక్, ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్, మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తదితరులు ఈ విందుకు హాజరయ్యారు. అయితే అమెరికా ఏఐ రంగంలోని మరో ప్రముఖ వ్యక్తి మాత్రం మిస్ అయ్యాడు. ఆయనే ఆంథ్రోపిక్ సీఈఓ డారియో అమోడీ. అసలైనోడే మిస్ కావడంతో అతడి మీదే ప్రధానంగా ఫోకస్ అయింది. ఆహ్వానించినా ఎందుకు రాలేదన్న చర్చ నడుస్తోంది.
ఎవరీ డారియో అమోడీ?
డారియో అమోడీ అమెరికాలోని ప్రముఖ ఏఐ సంస్థ ఆంథ్రోపిక్‌కు సీఈఓ. ఆ సంస్థ అభివృద్ధి చేసిన ‘క్లాడ్’ AI మోడల్స్‌కు ఆయన నేతృత్వం వహిస్తున్నారు. అత్యంత శక్తివంతమైన AI వ్యవస్థలు అభివృద్ధి చెందుతున్న కొద్దీ వాటి వల్ల కలిగే ప్రమాదాలను జాగ్రత్తగా అధ్యయనం చేసి, తగిన భద్రతా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అమోడీ, ఆంథ్రోపిక్ సంస్థ పలుమార్లు చెబుతూ వస్తుంది. ఆంథ్రోపిక్ 2026 ఆగస్టులో తన ‘Responsible Scaling Policy’ని అప్డేట్ చేసింది. అత్యంత అధునాతన AI మోడల్స్ కొత్త రకాల ప్రమాదాలను సృష్టించవచ్చని, వాటికి సమర్థమైన భద్రతా చర్యలు అవసరమని సంస్థ పేర్కొంది.
Also Read
- Pakistan: ‘‘హఫీజ్ సయీద్‌ను ఎప్పుడు విచారిస్తారు?’’.. పాకిస్తాన్ ప్రధాని మౌనం..
- Pakistan-Afghanistan War: పాక్-ఆఫ్ఘాన్ల మధ్య ఉద్రిక్తత.. పారిపోతున్న పాక్ సైనికులు.!
- Netanyahu: మా దేశంపై దాడి చేస్తే నీ భార్య సమర్థించలేదా? మమ్దానీపై నెతన్యాహు తీవ్ర ఆగ్రహం
- Shehbaz-Rahman: యూఎన్‌లో షెహబాజ్ షరీఫ్-తారిఖ్ రెహమాన్ భేటీ.. భారత్ దృష్టి!

AI అభివృద్ధిని వేగంగా కొనసాగిస్తూ అమెరికా, చైనా మధ్య పోటీలో ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలని కొందరు టెక్ వర్గాలు భావిస్తున్నప్పటికీ.. అమోడీ మాత్రం మరింత జాగ్రత్తగా ముందుకు వెళ్లాలని వాదించారు. అయితే ట్రంప్-జిన్‌పింగ్ చర్చల్లో AI కీలక అంశంగా మారిన సమయంలో అమోడీ గైర్హాజరు కావడం అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే ఆయనను ట్రంప్ ఉద్దేశపూర్వకంగా ఆహ్వానించలేదని చెప్పడానికి అధికారిక ఆధారం లేదు. అసలు ఆయన ఎందుకు హాజరు కాలేదన్న దానిపై కూడా ఎలాంటి అధికారిక వివరణ వెలువడలేదు. దీంతో ఉద్దేశపూర్వకంగా చేసిన చర్యగా భావించలేమని తాజా నివేదికలు పేర్కొంటున్నాయి.

ఇక ఆంథ్రోపిక్‌కు అమెరికా జాతీయ భద్రతా వ్యవస్థతోనూ సంబంధాలు ఉన్నాయి. అమెరికా ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఇంటెలిజెన్స్ విశ్లేషణ, ఆపరేషనల్ ప్లానింగ్, మోడలింగ్, సిమ్యులేషన్, సైబర్ ఆపరేషన్స్ వంటి కార్యకలాపాల్లో క్లాడ్‌ను ఉపయోగిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. అయితే AI వినియోగంపై కొన్ని పరిమితులను కొనసాగించాలని ఆంథ్రోపిక్ పట్టుబట్టడంతో ట్రంప్ ప్రభుత్వం, సంస్థ మధ్య గతంలో వివాదం కూడా తలెత్తింది. ముఖ్యంగా పూర్తిగా స్వయంప్రతిపత్తితో పనిచేసే ఆయుధ వ్యవస్థలు, అమెరికన్లపై భారీ స్థాయిలో దేశీయ నిఘా వంటి అంశాల్లో భద్రతా పరిమితులను తొలగించేందుకు సంస్థ నిరాకరించింది. ఈ వివాదం అనంతరం అమెరికా ప్రభుత్వం ఆంథ్రోపిక్‌ను ‘సప్లై చైన్ రిస్క్’గా గుర్తించగా.. సంస్థ దీనిపై న్యాయపరంగా సవాలు చేసింది.
ఇక చైనా విషయంలోనూ అమోడీ, ఆంథ్రోపిక్ వైఖరి ప్రత్యేకంగా కనిపిస్తుంది. అమెరికా AI ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు చైనాకు అధునాతన సెమీకండక్టర్లు, చిప్ తయారీ పరికరాల ప్రాప్యతపై ఆంక్షలు కొనసాగించాల్సిన అవసరం ఉందని అమోడీ గతంలో వాదించారు. ఇటీవల విడుదల చేసిన ఆంథ్రోపిక్ సెప్టెంబర్ 2026 థ్రెట్ ఇంటెలిజెన్స్ నివేదికలో చైనాకు చెందిన కొన్ని సంస్థలు, వ్యక్తులు క్లాడ్‌ను సైబర్ ఆపరేషన్స్, నిఘా, ఇంటెలిజెన్స్ విశ్లేషణ, సైనిక సంబంధిత కార్యకలాపాల్లో దుర్వినియోగం చేయడానికి ప్రయత్నించినట్లు పేర్కొంది. అలాంటి కార్యకలాపాలను గుర్తించి అడ్డుకున్నామని సంస్థ తెలిపింది.
AI ఎందుకు కీలకం?
ట్రంప్, జిన్‌పింగ్ సమావేశంలో వాణిజ్యం, సాంకేతికత వంటి అంశాలతో పాటు కృత్రిమ మేధస్సు కూడా కీలకంగా చర్చకు వచ్చింది. AI అభివృద్ధి, దాని ప్రమాదాలు, భద్రతా ప్రమాణాలు, అమెరికా-చైనా మధ్య సాంకేతిక పోటీ వంటి అంశాలపై ఇరు దేశాలు దృష్టి సారించాయి. ఇటీవలే అమోడీ, ఆల్ట్‌మన్ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో AI భవిష్యత్తు, దాని అవకాశాలు, ప్రమాదాలపై మాట్లాడారు. అత్యంత శక్తివంతమైన AI వ్యవస్థల వల్ల భారీ ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. కొన్ని సందర్భాల్లో తీవ్ర ప్రమాదాలు కూడా ఏర్పడే అవకాశం ఉందని అమోడీ హెచ్చరించారు. అంతర్జాతీయ స్థాయిలో AI భద్రతా ప్రమాణాల కోసం ప్రభుత్వాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఎందుకు హాజరు కాలేదు?
ట్రంప్-జిన్‌పింగ్ స్టేట్ డిన్నర్‌కు అమోడీ ఎందుకు హాజరు కాలేదన్నది మాత్రం ఇప్పటికీ స్పష్టంగా తెలియదు. వైట్‌హౌస్ విడుదల చేసిన అతిథుల జాబితాలో ఆయన పేరు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే AI భద్రత, స్వయంప్రతిపత్తి ఆయుధాలు, చైనా టెక్నాలజీ విధానం, జాతీయ భద్రత వంటి అంశాల్లో అమోడీ తీసుకుంటున్న వైఖరి కారణంగా.. ట్రంప్-జిన్‌పింగ్ భేటీ వంటి కీలక సమయంలో ఆయన గైర్హాజరు కావడం మాత్రం ప్రత్యేక చర్చగా మారింది.
అమెరికా-చైనా మధ్య AI పోటీ మరింత కీలక దశకు చేరుతున్న సమయంలో.. ఒకవైపు టెక్ దిగ్గజాలు ట్రంప్-జిన్‌పింగ్ విందులో పాల్గొంటే.. మరోవైపు AI భద్రతపై కఠిన వైఖరిని వ్యక్తం చేస్తున్న అమోడీ అక్కడ లేకపోవడం టెక్ ప్రపంచంలో ఆసక్తికర పరిణామంగా నిలిచింది.
తాజావార్తలు
-
Trump-Jinping: ట్రంప్ విందుకు అందరూ వచ్చారు.. అసలైనోడే డుమ్మా కొట్టాడు.. ఎవరా ముఖ్యుడు!
-
CM Revanth Reddy : సీఎం రేవంత్‌కు కేరళలో ఘన గౌరవం.. ‘బెస్ట్ పబ్లిక్ సర్వెంట్’ అవార్డు.!
-
Kaaka Update: సంక్రాంతి బరి నుంచి తగ్గేదేలే.. ‘కాకా’ పనులు షురూ!
-
Gyanesh Kumar: ‘జ్ఞానేష్ కుమార్‌కు పద్మభూషణ్ ఇవ్వాలి’.. బెంగాల్ బీజేపీ చీఫ్ వ్యాఖ్యలు
-
Pakistan: ‘‘హఫీజ్ సయీద్‌ను ఎప్పుడు విచారిస్తారు?’’.. పాకిస్తాన్ ప్రధాని మౌనం..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!