కిడ్నీ సంబంధిత సమస్య ఏదైనా సరే మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. కిడ్నీలు మన శరీరంలో ఫిల్టర్‌లా పనిచేస్తాయి. కిడ్నీలు మూత్రం ద్వారా శరీరంలో ఉండే హానికరమైన అంశాలను తొలగిస్తాయి.
ఈరోజుల్లో ఆరోగ్యకరమైన ఆహారం అనేది లేదు.. రసాయనిక ఎరువుల వల్ల తినే ఆహారం కూడా కలుషితం అవుతుంది.. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరిని ఈ సమస్య వేధిస్తుందని చెప్పవచ్చు.. మూత్రపిండాలల్లో రాళ్ల కారణంగా విపరీతమైన నొప్పి, తీవ్రమైన బాధ కలుగుతుంది. మారిన మన జీవన విధానం, ఆహారపు అలవాట్లు, నీటిని ఎక్కువగా తాగకపోవడం వంటి వివిధ కారణాల చేత ఈ సమస్య తలెత్తుతుంది. సాధారణంగా ఈ సమస్య నుండి బయటపడాలంటే శస్త్రచికిత్స ఒక్కటే మార్గమని…