Yanamala Krishnudu: తుని రాజకీయాల్లో కీలక పరిణామం.. జనసేనలో చేరిన యనమల కృష్ణుడు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yanamala Krishnudu Joins Janasena: తుని రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీనియర్ నేత యనమల కృష్ణుడు జనసేన పార్టీలో చేరారు. జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. కృష్ణుడు జనసేనలో చేరబోతున్నారనే ప్రచారం గత కొంతకాలంగా తుని రాజకీయ వర్గాల్లో కొనసాగగా.. తాజాగా అది కార్యరూపం దాల్చింది.
యనమల కృష్ణుడు గతంలో తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరించారు. 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తుని నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే రెండు ఎన్నికల్లోనూ ఆయన విజయం సాధించలేకపోయారు. 2024 ఎన్నికలకు ముందు టీడీపీలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో వైసీపీలో చేరారు. ముఖ్యంగా తుని టీడీపీ టికెట్ విషయంలో యనమల కుటుంబంలో నెలకొన్న రాజకీయ పరిణామాలు ఆయన పార్టీ మారడానికి కారణమయ్యాయి. 2024 ఎన్నికల్లో టీడీపీ అధిష్టానం యనమల రామకృష్ణుడి కుమార్తె యనమల దివ్యకు తుని టికెట్ కేటాయించడంతో.. కృష్ణుడు వైసీపీ గూటికి చేరారు.
Also Read
- TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
- Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
- Minister Rekha Arya Files FIR Against Husband: ఇతర మహిళలతో సంబంధాలు.. భర్తపై ఫిర్యాదు చేసిన మంత్రి.. అసలేం జరిగింది?
- YSRCP Candidates List: మేయర్, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. పూర్తి జాబితా ఇదే!
అయితే వైసీపీలో చేరిన తర్వాత తుని రాజకీయాల్లో యనమల కృష్ణుడికి అనుకున్న స్థాయిలో ప్రాధాన్యం దక్కలేదనే చర్చ సాగింది. స్థానిక వైసీపీ నేతలతో ఆయనకు సఖ్యత లేకపోవడం, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారనే ప్రచారం కూడా గతంలో వచ్చింది. ఈ నేపథ్యంలోనే కృష్ణుడు జనసేన వైపు అడుగులు వేశారు. నేడు పవన్ కళ్యాణ్ సమక్షంలోనే జనసేనలో చేరారు. కృష్ణుడు జనసేనలో చేరడంతో తుని నియోజకవర్గ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు తెరలేచినట్టైంది. ఆయన వెంట వచ్చే అనుచరులు, స్థానికంగా ఆయనకు ఉన్న రాజకీయ పరిచయాలు జనసేన రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!