సాధారణంగా పెళ్లి అనేది ఒక నరకమని ప్రతి మగాడి ఫీలింగ్.. ఫ్రీడమ్ ను భార్య చేతికి ఇచ్చి వారి చేతిలో బందీలా ఉన్నట్లు ఫీల్ అవుతూ ఉంటారు. ఎప్పుడైనా భార్య ఊరెళితే.. ఇక భర్తలకు చెప్పలేనంత సంతోషం.. ఏది కావాలంటే అది చేయొచ్చు.. ఫ్రీడమ్ ను ఎంజాయ్ చేయొచ్చు.. రిమోట్ ఇవ్వాల్సిన అవసరం లేదు.. బెడ్ మీద ఎటు కావాలన్న పడుకోవచ్చు.. ఇష్టమైన ఫుడ్ తినొచ్చు.. అబ్బో ఇలా మళ్లీ బ్యాచిలర్ లైఫ్ ను ఎంజాయ్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటారు.. అయితే కొన్ని సర్వేల ప్రకారం భార్య ఇంట్లో లేనప్పుడు ఈ పనులతో పాటు మరికొన్ని పనులు కూడా చేస్తారట.. అవేంటో చూద్దాం..
నిత్యం భార్యతో వేగడం అనేది చాలా కష్టమైన పని.. అయినా సరే ఏదో భర్తలు అలా వారి జీవితాలను లాకొచ్చేస్తున్నారు. గొడవ పడిన చివరికి భార్యలే నెగ్గుతారు అని తెలిసి ఏడవడానికి అహం అడ్డొచ్చి సైలెంట్ గా వెళ్ళిపోతారు. అయితే ఇలా భార్య ఇంట్లో లేని సమయంలో ఎవరు చూడడం లేదు అనుకున్నప్పుడు భర్తలు రూమ్ లో బిగ్గరగా ఏడుస్తారట.. ఇన్నాళ్లుగా లోపల దాచుకున్న బాధను అంతా ఒంటరిగా వెళ్లగక్కి గట్టిగా అరుస్తూ ఏడుస్తారట.. కొంచెం చిత్రంగా ఉన్నా ఇది నిజమని సర్వేలు చెప్తున్నాయి.
ఇక బ్యాచిలర్ గా ఉన్నప్పుడు ప్రతి మగాడు అన్ని రకాల వంటకాలను టెస్ట్ చేయడానికి ఇష్టపడతారు. ప్రయోగాలైన తామే చేసుకొని దాన్ని అద్భుతంలా చేసుకొని తింటారు.. ఇక భార్య వచ్చాకా ఆమె ఏది వండితే అది తినడమే తప్ప అలాంటి వాటికి అవకాశం ఉండదు.. అయితే భార్య ఇంట్లో లేనప్ప్పుడు విభిన్న, వింతైన ఆహారాలను టేస్ట్ చేస్తారు: భార్య ఇంట్లో లేనప్పపుడు డిఫరెంట్ టేస్ట్ ను ఆస్వాధించడానికి ప్రయత్నిస్తారు. అంతేకాదు ఇంట్లో ఉన్న అన్ని ఐటెమ్స్ ను కలిపి తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇది మనకు కాస్త వికారంగా అనిపించినా.. దీనిని వారు యమ్మీగా ఫీలవుతారట.
ఇక ఈ విషయం అందరికి తెలిసిందే.. ఇంట్లో భార్య లేనప్పుడు భర్త తనకిష్టమైన సినిమాలనో, వీడియోలనో చూస్తూ ఉంటాడు. అవి ఎలాంటి వీడియోలైనా సరే.. చాలా ఇంట్రెస్ట్ గా, ఓపిగ్గా చూస్తారట.. భార్య ఉన్నప్పుడు ఒక సినిమాను ఫుల్ గా చూడడానికే ఇష్టపడని వారు ఒక్కరే ఉన్నప్పుడు సిరీస్ లు సిరీస్ లు లేపేస్తారట.. ఇక అశ్లీల చిత్రాలను చూడటం కూడా కొంతమంది చేస్తారట.. అయితే కొన్ని చోట్ల కొంటామని భార్య లేనప్పుడు మరొకరిని తీసుకురావాలని అనుకుంటారట.. అయితే మళ్లీ అది ఎక్కడ ఇంట్లో తెలిసి గొడవలు అవుతాయేమోనని ఆలోచించి బయట పెట్టరట..
స్నేహితులు భార్య ఉన్నప్పుడు రావడం వేరు.. ఆమె లేనప్పుడు రావడం వేరు.. భార్య ఉన్నప్పుడు వచ్చినా ఫార్మాలిటీగా మాట్లాడుకుంటారు.. ఇక అదే భార్య లేదు అంటే.. మామ ఎక్కడున్నావ్.. వచ్చేయ్ కుమ్మేద్దాం మా ఇంట్లో నా భార్య లేదు అని చెప్పేసి వారితో ఎక్కువ సమయాన్ని గడుపుతారట.. అలా తమ మధ్య పెరిగిన దూరాన్ని తగ్గించుకుంటారట..
ఇక ఇది కొంచెం విచిత్రమనే చెప్పాలి.. కొంతమంది భర్తలు, భార్యలు ఇంట్లో లేనప్పుడు ఆమె మేకప్ కిట్స్ ను పరిశీలిస్తారట.. అంతేకాకుండా వారు ఎలా ఇంత మేకప్ వేసుకుంటారో అని వీరు కూడా ట్రై చేస్తారట.. లిప్ స్టిక్ టేస్ట్ చేయడం, మస్కారాపెట్టుకోవడం లాంటివి చేస్తారట.. ఇలాంటి విషయాలు తెలుసుకోవాలని వారికి ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుందట.
ఇక భార్య ఇంట్లో లేకపోతే చాలా మంది పురుషులకు ఎక్కువ సేపు టాయిలెట్ లో కూర్చొని సమయం గడుపుతారట. ముఖ్యంగా టాయిలెట్ లో మొబైల్ ఫోన్ తో గంటల తరబడి కూర్చుంటారట. ఎవరు పిలువరు . ఎటువంటి ప్రశంలు వేయరు కాబట్టి అక్కడే వారి ప్రశాంత్మైన మైండ్ కు పదును పెడతారట.. ఏదైనా ఆలోచించినా, కొత్త ఐడియాలు వచ్చేది బాత్ రూమ్ లోనే వస్తాయి అంటున్నారు కొంతమంది పురుషులు. మరి అందులో నిజం ఎంత అనేది తెలియాలి.
ఇలా చివరగా నిద్ర.. ప్రశాంతంగా నిద్రపోతారట.. ఇంట్లో భార్య లేనప్పుడు ఎక్కువమంది భర్తలు నిద్రపోవడానికి సమయం కేటాయిస్తారట. మరి వీటిలో మీరు ఎలాంటి కేటగిరిలో ఉన్నారు.. ఎలాంటి పనులు చేస్తున్నారో చూసుకోండి.