Diabetes: కోవిడ్ తర్వాత దేశంలో భారీగా పెరుగుతున్న షుగర్ వ్యాధి..
- NFHS-6 నివేదికలో డయాబెటిస్, ఊబకాయం కేసులు భారీగా పెరిగినట్లు వెల్లడి.
- పురుషుల్లో మధుమేహం 15.6% నుంచి 20.9%కు పెరుగుదల.
- మహిళల్లో డయాబెటిస్ రేటు 13.5% నుంచి 17.8%కు చేరిక.
- పట్టణ ప్రాంతాల్లో ఊబకాయం సమస్య అత్యంత తీవ్రంగా ఉన్నట్లు సర్వే గుర్తింపు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Diabetes: కోవిడ్-19 మహమ్మారి తర్వాత భారతీయుల్లో ‘‘మెటాబాలిజం’’ వల్ల వచ్చే వ్యాధులు పెరుగుతున్నాయి. ఇంట్లో ఎక్కువ సమయం గడపడం, శారీరక శ్రమ లేకపోవడం, అనారోగ్యమైన ఆహారపు అలవాట్లు పెరగడం సమస్యను పెంచుతున్నాయి. ఊబకాయం, మధుమేహం(డయాబెటిస్) వంటి జీవనశైలి ఆరోగ్య సమస్యలు పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే-6 (NFHS-6) నివేదిక వెల్లడించింది. 2023-24 కాలంలో నిర్వహించిన ఈ సర్వేలో దేశవ్యాప్తంగా సుమారు 6.79 లక్షల కుటుంబాలు పాల్గొన్నాయి. మణిపూర్ మినహా దేశవ్యాప్తంగా 715 జిల్లాలను సర్వే కవర్ చేసింది.
పురుషుల్లో పెరిగిన షుగర్ వ్యాధి:
15 ఏళ్లకు పైబడిన పురుషుల్లో డయాబెటిస్ కేసులు గణనీయంగా పెరిగాయి. రక్తంలో చక్కెర స్థాయిలు 141mg/dl కంటే ఎక్కువగా ఉన్నవారిని లేదా డయాబెటిస్ మందులు తీసుకుంటున్నవారిని ఈ గణాంకాల్లో పరిగణించారు. 2019-20 నివేదికలో పురుషుల్లో డయాబెటిస్ 15.6 శాతంగా ఉండగా, NFHS-6లో అది 20.9 శాతానికి పెరిగింది. దేశంలో 15 ఏళ్లకు పూబడిన పురుషులు 56 కోట్ల మంది ఉంటే వీరిలో 11.7 కోట్ల మంది డయాబెటిస్తో బాధపడుతున్నారని వెల్లడైంది. 2021లో ఇది 8.7 కోట్లుగా ఉండేది.
Also Read
- Plastic Chairs Cleaning Tips: పసుపెక్కిన ప్లాస్టిక్ కుర్చీలను చూసి విసిగిపోయారా? ఈ టిప్‌తో మీ కుర్చీలకు కొత్త లుక్!
- Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
- Homemade Vegetable Chips: బంగాళాదుంప చిప్స్‌కు బైబై.. ఈ 8 కూరగాయలతో ఇంట్లోనే క్రిస్పీ చిప్స్!
- Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
మహిళల్లో కూడా మధుమేహం సమస్య పెరుగుతోంది. NFHS-5లో 13.5 శాతం ఉన్న మధుమేహం, ప్రస్తుతం 17.8 శాతానికి చేరుకుంది. మూడేళ్ల క్రితం 5.4 కోట్ల మంది మహిళలు డయాబెటిస్తో బాధపడుతుండగా, ఇప్పుడు ఆసంఖ్య 7.12 కోట్లకు పెరిగింది.
ఊబకాయం మరో సమస్య:
మధుమేహంతో పాటు మధుమేహానికి ప్రారంభ కారణాల్లో ఒకటైన ఊబకాయం కూడా వేగంగా పెరుగుతోంది. 15-49 ఏళ్ల మహిళల్లో అధిక బరువు, ఊబకాయం సమస్య 24 శాతం నుంచి 30.7 శాతానికి పెరిగింది. పట్టణ ప్రాంతాల్లో ఈ పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. పట్టణాల్లో 42.8 శాతం మహిళలు అధిక బరువు, ఊబకాయంతో బాధపడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇది 25.5 శాతంగా నమోదైంది. పురుషుల్లో కూడా ఇదే ధోరణి కనిపిస్తోంది. 2019-20లో 22.9 శాతం ఉన్న అధిక బరువు, ఊబకాయం రేటు 2023-24లో 27.3 శాతానికి చేరుకుంది. పట్టణాల్లో 36.3 శాతం మంది పురుషులు, గ్రామీణ ప్రాంతాల్లో 23 శాతం మంది ఈ సమస్యతో బాధపడుతున్నట్లు సర్వే తెలిపింది.
తాజావార్తలు
-
Hash Oil : స్నాప్‌చాట్‌లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
-
VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్‌కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
-
CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
-
New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
-
Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!