తాలింపులో కరివేపాకు వేస్తేనే రుచి వస్తుంది.. ఎంత తీసి పెట్టినా కూడా వేస్తారు.. రుచిని పెంచడంతో పాటుగా ఆరోగ్యాన్ని కూడా పెంచుతుంది.. కరివేపాకుల్లో విటమిన్ సి, మెగ్నీషియం, ఐరన్, కాపర్, కాల్షియం, ఫాస్పరస్, ఫైబర్, కార్బోహైడ్రేట్లు వంటి ముఖ్యమైన పోషకాలు ఇందులో ఉంటాయి. భారతదేశంలోని చాలా వంటలలో ఈ ఆకులను ఉపయోగిస్తారన్న విషయం మీకు తెలిసిందే. ఇవి రుచి పరంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా మేలు చేస్తాయి. చాలా మంది ఆరోగ్య నిపుణులు ప్రతిరోజూ కరివేపాకును తీసుకుంటే ఎటువంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ఉదయం పరగడుపున కరివేపాకును తీసుకుంటే షుగర్ కంట్రోల్ లో ఉంటుంది.. రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. కావాలంటే కరివేపాకును ఎండలో ఆరబెట్టి పొడి చేసి నిల్వ చేసుకోని తినవచ్చు..
పెరుగుతున్న బరువుతో ఇబ్బంది పడే వారికి, కరివేపాకు చాలా మంచిది. ఉదయం లేవగానే కరివేపాకు ఆకులు నమలడం వల్ల శరీరం డిటాక్స్ అవ్వడమే కాకుండా మెటబాలిజం కూడా పెరుగుతుంది. దీని కారణంగా క్రమంగా బరువు తగ్గడం ప్రారంభమవుతుంది..
జుట్టు రాలడం లేదా ఇతర జుట్టు సమస్యలను ఎదుర్కొంటున్న వారు కరివేపాకులను తప్పనిసరిగా తినాలి. ఇది జుట్టును బలపరుస్తుంది. జుట్టు రాలడాన్ని ఆపుతుంది. ఇది కాకుండా, మీకు కావాలంటే, మీరు దీన్ని మెత్తగా రుబ్బి మీ జుట్టుకు అప్లై చేసుకోవచ్చు. ఈ హెయిర్ మాస్క్ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది…
మీకు కడుపునొప్పి వచ్చినప్పుడల్లా, ఒక పాన్‌లో నీటిని మరిగించి, దానికి కొన్ని కరివేపాకులను జోడించండి. మరిగిన తర్వాత నీరు వడగట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి. దీంతో అనేక పొట్ట సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది..
ఈ కరివేపాకును చర్మంపై కురుపులు లేదా మొటిమలు ఏర్పడిన అప్లై చేయాలి.. ఈ ఆకులను మెత్తగా రుబ్బి అప్లై చేయడం వల్ల దీని ప్రభావం కొన్ని రోజుల్లోనే కనిపిస్తుంది.. కీళ్ల నొప్పులు కూడా తగ్గుతాయని నిపుణులు అంటున్నారు..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.